Saturday, April 27, 2024

టీ20 వరల్డ్ కప్ నుంచి వెస్టిండీస్ ఔట్..

టీ20 వరల్డ్‌కప్‌ నుండి వెస్టిండీస్ జట్టు నిష్క్రమించింది. ఈరోజు గ్రూప్‌ బి మ్యాచ్‌లో భాగంగా హోబర్ట్‌లో వెస్టిండీస్ వర్సెస్ ఐర్లాండ్ జట్ల మధ్య జరిగిన టీ20 మ్యాచ్ లో వెస్టిండీస్‌పై ఐర్లాండ్‌ జట్టు 9 వికెట్ల తేడాతో నెగ్గింది. ఈ విజయంతో ఐర్లాండ్‌ జట్టు సూపర్‌ 12లోకి ప్రవేశించింది. ఇక ఓటమిని ఎదుర్కొన్న వెస్టిండీస్‌ టోర్నీ నుంచి ఇంటిదారి పట్టింది. మొదట బ్యాటింగ్‌ చేసిన విండీస్‌ జట్టు 5 వికెట్లకు 146 రన్స్‌ చేసింది.

ఆ జట్టులో బ్రాండన్‌ కింగ్ అత్యధికంగా 62 రన్స్‌ చేశాడు. 147 రన్స్‌ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఐర్లాండ్‌ దూకుడుగా ఆడింది. మరో 15 బంతులు మిగిలి ఉండగానే ఐర్లాండ్‌ విజయాన్ని అందుకుంది. పౌల్‌ స్టిర్లింగ్‌, ఆండీ బల్బిర్ని తొలి వికెట్‌కు 73 రన్స్‌ జోడించారు. పవర్‌ ప్లేలో ఐర్లాండ్‌ 64 రన్స్‌ చేసింది. బల్బిర్ని 37 రన్స్‌ చేసి ఔటయ్యాడు. స్టిర్లింగ్‌ 66, టక్కర్‌ 45 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement