Wednesday, May 1, 2024

సినిమా అంటే ఇలా ఉండాలి..కాంతారాపై కంగనారనౌత్ ప్రశంసలు

ఎటువంటి వారినైనా..ఎవరి సినిమానైనా విమర్శించడంలో ముందుంటుంది బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనారనౌత్.
ఆమె ఇతరుల సినిమాని పొగిడిన ఘటనలు చాలా అరుదనే చెప్పాలి. అటువంటింది రీసెంట్ గా రిలీజ్ అయిన కాంతారా మూవీపై ప్రశంసలు కురిపించంది. సోషల్ మీడియాలో ఈ చిత్రంపై ఆమె స్పందిస్తూ.. తన కుటుంబసభ్యులతో కలిసి ఇప్పుడే సినిమా చూశానని… ఇప్పటికీ తన శరీరం వణుకుతోందని అన్నారు. ఈ చిత్రాన్ని వీక్షించడం ఒక అద్భుతమైన అనుభవమని చెప్పారు. జానపద కథలు, సంప్రదాయాలు, దేశీయ సమస్యల కలయికే ఈ సినిమా అని అన్నారు. రిషబ్ శెట్టి నీకు హ్యాట్సాఫ్. రచన, దర్శకత్వం, నటన, యాక్షన్ అంతా అద్భుతం. నమ్మలేకపోతున్నా. అందమైన ఫొటోగ్రఫీ, యాక్షన్, థ్రిల్లర్. సినిమా అంటే ఇలా ఉండాలి. ప్రేక్షకులు థియేటర్ కు వచ్చి సినిమా చూడాలంటే ఇలా ఉండాలి. ఇప్పటి వరకు ఇలాంటి సినిమాను చూడలేదంటూ కొందరు ప్రేక్షకులు సినిమా అయిపోయిన తర్వాత బయటకు వస్తూ అనుకుంటుండటం నేను విన్నాను. ఇలాంటి సినిమా తీసినందుకు ధన్యవాదాలు. మరో వారం పాటు ఈ అనుభూతి నుంచి నేను బయటకు రాలేననే అనుకుంటున్నా అని కంగన తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement