Wednesday, May 22, 2024

TS: వాకింగ్ ట్రాక్ లు, ఇండోర్ ప్లేగ్రౌండ్స్ కోసం కృషి చేస్తా.. ఎంపీ అభ్యర్థి నీలం మధు

నీలం మధు మార్నింగ్ వాక్..
బీహెచ్ఈఎల్ గ్రౌండ్ లో వాకింగ్..
వాకర్లు, సీనియర్ సిటిజన్లు, యువతతో ముచ్చట
పరిశ్రమలతో ఉపాధి కల్పించిన కాంగ్రెస్

మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు బుధవారం బీహెచ్ఈఎల్ గ్రౌండ్ లో వాకింగ్ చేశారు. పటాన్ చెరు నియోజకవర్గం బీహెచ్ఈఎల్ గ్రౌండ్ కు ఉదయం విచ్చేసిన నీలం మధు వాకర్లు, ఎంప్లాయిస్, రిటైర్డ్ ఎంప్లాయిస్, సీనియర్ సిటిజన్లు, యువతను కలిశారు. వారితో కలిసి వాకింగ్ చేశారు. క్రికెట్ ఆడి క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపారు. అనంతరం వారితో ముచ్చటించారు. ముఖ్యంగా బీహెచ్ఈఎల్ గ్రౌండ్ తోపాటు స్థానికంగా నెలకొన్న సమస్యలను నీలం మధుకు వివరించారు. ప్రతి ఒక్కరికి మే డే శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీగా తనను గెలిపించాలని అభ్యర్థించారు.


పరిశ్రమలతో..ఉపాధి కల్పించిన కాంగ్రెస్ : నీలం మధు
మెదక్ గడ్డ నుంచి ఎంపీగా పోటీచేసి ప్రధాని అయినటువంటి స్వర్గీయ ఇందిరా గాంధీ పరిశ్రమలను తీసుకొచ్చి ఉపాధి కల్పించిందని నీలం మధు పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో బీహెచ్ఈఎల్ ను నెలకొల్ప‌డం ద్వారా వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కాయని తెలిపారు. అలాగే బీడీఎల్, ఈక్రిసాట్ వంటి గవర్నమెంట్ సెక్టార్లన్నీ మెదక్ జిల్లాలో నెలకొల్పడం జరిగిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతోందన్నారు. దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమని, రాహుల్ గాంధీ నేతృత్వంలో పాంచ్ గ్యారెంటీలను అమలు చేసి తీరుతామన్నారు. యువత ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. తాను ఎంపీగా గెలిచాక ఎంపీ, సిఎస్ఆర్ ఫండ్స్ తో వాకింగ్ ట్రాక్ ల అభివృద్ధి, ఇండోర్ స్టేడియంలో ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు కొల్లూరు నరసింహారెడ్డి, కొల్లాపూర్ మున్సిపల్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి,113 డివిజన్ అధ్యక్షులు శ్రీనివాస్, మైనార్టీ నాయకులు అన్వర్ పటేల్, అరుణ్ గౌడ్, శేఖర్, మెట్టు కృష్ణ, తూర్పు శ్రీను, బిహెచ్ఈఎల్ ఐఎన్టీయూసీ కార్మికులు నాయకులు పాల్గొన్నారు.

సదాశివపేట పట్టణంలో ఎంపీ అభ్యర్థి నీలం మధు ప్రచారం..
గాంధీ చౌక్ లో కార్నర్ మీటింగ్ ..
ఆలోచించి ఓటెయ్యాలి : నీలం మధు
మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ఎన్నికల ప్రచారంలో జన ప్రభంజనం కొనసాగింది. సదాశివపేట పట్టణంలో మంగళవారం సాయంత్రం చేపట్టిన రోడ్ షోకు జనం భారీగా తరలివచ్చారు. మద్దికుంట చౌరస్తా నుంచి సదాశివపేట పట్టణానికి చేరుకున్న రోడ్ షో అంబేద్కర్ సెంటర్ నుంచి గాంధీ చౌరస్తా వరకు కొనసాగింది. సంగారెడ్డి డీసీసీ అధ్యక్షులు నిర్మల జగ్గారెడ్డి, సీనియర్ నేత పులిమామిడి రాజుతో కలిసి ఎంపీ అభ్యర్థి చేస్తూ రోడ్ షోలో పాల్గొన్నారు.


ఈ సందర్భంగా గాంధీ చౌరస్తా కార్నర్ మీటింగ్ లో ఎంపీ అభ్యర్థి నీలం మధు మాట్లాడారు. పార్లమెంటు ఎన్నికలలో ఆలోచించి ఓటెయ్యాలని మెదక్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు విజ్ఞప్తి చేశారు. ఇది వరకే ఆనేక హామీలు ఇచ్చిన బిజెపి, బీఆర్ఎస్
పార్టీలు ప్రజలను మోసం చేశాయని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే కట్టుబడి ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు సమన్యాయం చూపుతూ వస్తోందన్నారు. ముఖ్యంగా పేదలకు ఇండ్లు, భూములు ఇచ్చి అన్ని రకాలుగా ఆదుకుందని గుర్తు చేశారు. సదాశివ మున్సిపాలిటీ లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తనను ఎంపీ అభ్యర్థిగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సత్తన్న, చోటు బాయ్, ఉస్మాన్, వాసీం, రామ్ రెడ్డి, చిన్న, కృష్ణ, సుభాష్ , ఖాసిం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement