Sunday, February 25, 2024

Breaking: బీజేపీకి గుడ్ బై చెప్పిన దాసోజు శ్రవణ్

బీజేపీకి దాసోజు శ్రవణ్ గుడ్ బై చెప్పారు. ఈరోజు సాయంత్రం దాసోజు శ్రవణ్ టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. ఈసందర్భంగా ఆయన బీజేపీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ తీరును తప్పుబడుతూ దాసోజు శ్రవణ్ హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీ లో దశ దిశ లేని రాజకీయ పరిణామాలు సాగుతున్నాయన్నారు. మునుగోడులో బీజేపీ అనుసరిస్తున్న తీరు జుగుప్సాకరమన్నారు. పెట్టుబడి రాజకీయాలతో తన లాంటి వారికి స్థానం లేదని తేటతెల్లమైందన్నారు.

దశ దిశ లేని నాయకత్వం తెలంగాణ సమాజానికి ఉపయోగపడదన్నారు. మందు, మాంసం, నోట్ల ద్వారా గెలవాలనుకోవడం బాధాకరమన్నారు. బీజేపీలో జరుగుతున్న పరిణామాలపై బీజేపీ చీఫ్ బండి సంజయ్ కు ఆవేదనతో కూడిన లేఖ దాసోజు శ్రవణ్ రాశారు. ఈరోజు సాయంత్రం మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement