Thursday, May 16, 2024

ఉక్రెయిన్‌కు 100 మిలియన్‌ డాలర్ల సాయం ప్రకటించిన యూకే

గత పదిరోజులకు పైగా ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం చేస్తున్న విషయం విదితమే. అయితే పలు దేశాలు ఉక్రెయిన్ కు సహకారమందిస్తున్నాయి. ప్రస్తుతం ఉక్రెయిన్‌కు యూకే 100 మిలియన్‌ డాలర్ల సాయం చేస్తోంది. రష్యా యుద్ధంతో అతలాకుతలమవుతోన్న ఉక్రెయిన్‌ను ఆర్థికంగా ఆదుకోవడం కోసం బ్రిటన్‌ ప్రభుత్వం ముందుకొచ్చింది. ఆ దేశానికి 100 మిలియన్‌ డాలర్ల ఆర్థిక సాయం ప్రకటించింది. ఉక్రెయినియన్ల సంక్షేమం, ఉద్యోగుల జీతాలు తదితర ఖర్చులకు ఈ నిధులు ఉపయోగపడుతాయని యూకే ప్రభుత్వం తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement