Wednesday, May 22, 2024

ఇరుకున పెడుతున్న ఇంగ్లీష్ టైటిల్స్

సంప్రదాయాన్ని, సంస్కృతిని ప్రతిబింబిం చాల్సిన ప్రాంతీయ సినిమాలు ఇప్పుడు పాశ్చాత్య ధోరణి అవలంబిస్తున్నాయనే విమర్శలున్నాయి. కొత ్తతరం దర్శకులు తాము తీస్తున్న సినిమాల్లో ఇప్పటికే సంస్కృతికి తిలోదకాలిచ్చేశారు. ఇప్పుడు మాతృభా షను సైతం విస్మరిస్తున్నారు. ఆధునికపోకడ పేరుతో సినిమాలకు ఇంగ్లీష్‌ టైటిల్స్‌ పెడుతున్నారు. ఒకటి రెండు కాదు చాలా సినిమాలకు ఇదే తరహాలో టైటిల్స్‌ నిర్ణయి స్తున్నారు.
గతంలో ఈ తరహా ఆంగ్ల చిత్రాల పేర్లకు బ్రేక్‌ వేయాలని తమి ళనాడు ప్రభుత్వం చెక్‌ పెట్టింది. టైటిల్‌ తమిళ్‌లోనే పెట్టాలనే నిబంధన విధించింది. దీన్ని ఆ తర్వాతి ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం తో తమిళంలో కూడా అంగ్ల టైటిల్స్‌ వస్తున్నాయి.
తెలుగులో ఈమధ్య విడుదల అయిన కొన్ని సినిమాలు ఇంగ్లీష్‌లో -టైటిల్స్‌ పెట్టారు. నిజంగా అవ సరమా లేక యువతను ఆకట్టుకునేందుకా? అనే సందేహం కూడా వస్తుంది. చూస్తే అది నిజమేనేమో అనిపి స్తూ ఉంటు-ంది. అయితే ఇలా ఆంగ్ల -టైటిల్స్‌తో వచ్చిన సినిమా లు మిశ్రమ ఫలితం పొందడం విశేషం. బాక్స్‌ ఆఫీస్‌ దగ్గర నడవలేదు. ఏవో ఒకటి రెండు సినిమాలు తప్పితే, చాలా సినిమాలు ఫెయిల్‌ అయ్యాయి అనే చెప్పాలి.


పరిశ్రమ వర్గాల్లో ఇది అంతర్గత చర్చకు దారితీసింది. తెలుగు సినిమాలకి ఆంగ్ల -టైటిల్స్‌ పెడి తే ఆ సినిమాలు సరిగ్గా నడవటం లేదు అని. వారి చర్చ ఎలా వున్నా, విడుదల అయిన కొన్ని సినిమాలు చూస్తే అది నిజమే అనిపిస్తూ ఉంటు-ంది. చాలా ఆంగ్ల -టైటిల్స్‌ తో వచ్చిన సినిమాలు బాక్స్‌ ఆఫీస్‌ దగ్గర నడవలేదు.
అయితే ఈమధ్య వచ్చిన ఆంగ్ల -టైటిల్స్‌ పెట్టిన తెలుగు సినిమాలు మీద ఓ కన్నేద్దాం. ఈమధ్యనే విడుదల అయిన సినిమా అమిగోస్‌ (ఇది ఫ్రెంచ్‌ పేరు), ఇందులో కళ్యాణ్‌ రామ్‌ మూడు విభిన్న పాత్రలు పోషించాడు. సినిమాలో నేపధ్యం కూడా డాపుల్‌ గేం గర్‌ అని ఆంగ్లం లోనే ప్రచారాన్ని చేసారు. అందు వలనే ఈ సినిమా అంతగా ప్రజల్లోకి ఆశించిన స్థాయిలో వెళ్ళలేదు అని ఒక టాక్‌ నడిచింది. ఎందు కంటే సినిమాకి కుటు-ంబ ప్రేక్షకులు రావాలి, అప్పుడే ఆ సినిమా విజయం సాధిస్తుంది.
ఆ మధ్య వచ్చిన మరో సినిమా ‘హంట్‌’, ఇందులో సుధీర్‌ బాబు నటించారు. ఇది కూడా అంతే. ఆంగ్ల -టైటిల్‌.
ప్రేక్షకులు ఊహించిన దానికి భిన్నంగా ఉండటంతో సినిమా ఆడలేదు. నాగార్జున నటించిన ‘ది ఘోస్ట్‌. ఇది కూడా బాక్స్‌ ఆఫీస్‌ దగ్గర ఏమీ ప్రభావం చూపలేక పోయింది. అలాగే రామ్‌ పోతినేని నటించిన ‘ది వారియర్‌’ కూడా విజయం సాధించలేదు. ఇంకో సినిమా ‘లైక్‌ షేర్‌ సబ్‌ స్క్రయిబ్‌’ దర్శకుడు మేర్లపాక గాంధీకి అపజయాన్ని ఇచ్చింది. యువకులకు ఇలాం టివి తెలుసే మో కానీ, వాళ్ళు ఒక్కరే వస్తే సినిమా విజయం సాధిం చాడు. అలాగే నాగ చైతన్య నటించిన ‘ధాంక్యూ’ కూడా ఆడలేదు.
విజయ్‌ దేవరుకొండ , పూరి జగన్‌ కాంబి నేషన్‌లో వచ్చిన సినిమా ‘లైగర్‌’. ఈ మూవీ ఎంత అపజయం పాలయిందో, ఎన్ని ఇక్కట్లు- తెచ్చి పెట్టిందో అందరికీ తెలిసిందే…ఇక ప్రముఖ నిర్మాత, దర్శకుడు ఎం.ఎస్‌. రాజు ‘7 డేస్‌ 6 నైట్స్‌’ అనే సినిమా -టైటిల్‌ తో వచ్చారు. దాని ప్రభావం కూడా ఏమి లేదు. ఆది సాయికుమార్‌ ఈమధ్య ‘టాప్‌ గేర్‌’ సినిమా ఓ మోస్తారుగా ఉన్నా ఆడలేదు.
సినిమాకు యువ ప్రేక్షకులు లక్ష్యం కోసం ఆంగ్ల టైటిల్స్‌ పెడుతున్నారని తెలిసింది. కానీ థియేటర్లు నిండాలంటే అందరికీ సులువుగా అర్థమయ్యే పేరు నిర్ణయించాలి. తప్పని పరిస్థితిలో అందరికీ తెలిసిన ఆంగ్ల టైటిల్‌ పెడితే అర్థం చేసుకోవచ్చు. హిట్‌, మేజర్‌ ఈ తరహాలో వచ్చినవే. చిరంజీవి నటించిన గాడ్‌ఫా దర్‌ సినిమా కంటే వాల్తేరు వీరయ్య బాగా ఆడిందనే విషయం తెలిసిందే. ఆంగ్ల టైటిల్స్‌ నిర్ణయించేపుడు దర్శకులు ఆలోచిస్తే మంచిది. సినిమాలు ఇతర భాష ల్లో రిలీజవుతాయనే కారణం చూపుతూ ఆంగ్ల టైటిల్‌ పెట్టడం సరికాదని భాషా ప్రేమికులు అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement