Sunday, October 17, 2021

తెలంగాణ కరోనా కేసులు ఎన్నంటే..?

తెలంగాణ కరోనా కేసులు స్థిరంగా నమోదవుతున్నాయి. తాజాగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 52,683 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా… కొత్తగా 245 పాజిటివ్‌ కేసులు వెలుగు చూశాయి.. మరో వ్యక్తి కోవిడ్‌ బారినపడి మృతిచెందాడు.. ఇదే సమయంలో.. 173 కోవిడ్‌ బాధితులు కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.. దీంతో.. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,65,749కి చేరగా.. రికవరీ కేసులు 6,57,213కి పెరిగాయి.. ఇక, మృతుల సంఖ్య 3,916కు పెరిగిందని.. ప్రస్తుతం రాష్ట్రంలో 4,620 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి బులెటిన్‌లో పేర్కొన్నారు. ఇక, తాజా కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 73 కొత్త కేసులు వెలుగుచూశాయి.

ఇది కూడా చదవండి: బీసీ కులగణన చేపట్టాల్సిందే: బీసీ సంఘాలు..

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News