Tuesday, April 23, 2024

బీసీ కులగణన చేపట్టాల్సిందే: బీసీ సంఘాలు..

బీసీ కులగణన చేపట్టకపోతే ఆ బీజేపీకి ఓట్లు వేసే ప్రసక్తే లేదని తెలంగాణలోని బీసీ సంఘాలు తేల్చిచెప్పాయి కేంద్రానికి తేల్చి చెప్పాయి. హైదరాబాద్‌లోని సిటీ సెంట్రల్ కోర్టు హోటల్‌లో ఏర్పాటు చేసిన బీసీ కుల సంఘాల సమావేశంలో పాల్గొన్న నేతలు పార్టీలకు అతీతంగా కుల గణనపై డిమాండ్ చేశారు. బీజేపీకి బీసీల ఓట్లు కావాలి కానీ వారి సంక్షేమం అవసరం లేదా అంటూ ప్రశ్నించారు. జాతీయ స్థాయిలో 56 శాతం ఉన్న బీసీల బాగోగులు పట్టని మోదీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. జాతి నిర్మాణంలో భాగమైన బీసీలను విస్మరిస్తే ప్రభుత్వాలకు, పార్టీలకు పుట్టగతులు ఉండవన్నారు. చట్టసభల్లో రిజర్వేషన్లు కావాలని 75 ఏండ్ల స్వాతంత్య్ర దేశంలో బీసీలు వాటిని కావాలని కొరడమే దౌర్భాగ్యమా అని ప్రశ్నించారు.

ఇది కూడా చదవండి: రాజకీయాల్లో కలుపు మొక్కలు తీసేస్తా: పవన్ కళ్యాణ్

Advertisement

తాజా వార్తలు

Advertisement