Thursday, May 2, 2024

క్రూర‌త్వాన్ని ఆపండి – ర‌ష్యా అధ్య‌క్షుడికి ‘పోప్’ పిలుపు

ఉక్రెయిన్‌లో రక్తపుటేరులు, కన్నీటి నదులు ప్రవహిస్తున్నాయి. ఇది కేవలం సైనిక చర్య మాత్రమే కాదు, మృత్యువు, విధ్వంసం.. దుఃఖానికి బీజం వేసే యుద్ధం’ అని పోప్ ప్రాన్సిస్ అన్నారు. యుద్ధాన్ని వెంటనే ఆపాలని కోరారు. అది ఉన్మాదం అని చెప్పుకొచ్చారు. ఆ అమరవీరుల దేశంలో మానవతా సహాయం అవసరం గంట గంటకు పెరుగుతోంది” అని పోప్ అన్నారు. “యుద్ధం అంటే పిచ్చి! దయచేసి ఆపండి! ఆ క్రూరత్వాన్ని మానేయండని తెలిపారు. హోలీ సి శాంతిని పునరుద్ధరించడంలో ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుందని పోప్ అన్నారు. సహాయార్థుల కోసం ఇద్దరు రోమన్ కాథలిక్ కార్డినల్స్ ఉక్రెయిన్‌కు వెళ్లారని చెప్పారు. ప్రమాదం.. ప్రాణాలకు అపాయం అని తెలిసీ.. ప్రాణాలకు తెగించి యుద్ధాన్ని కవర్ చేస్తున్న విలేకరులకు, అక్కడి ప్రజల మీద జరుగుతున్న కృరత్వం, హింసలను వెలుగులోకి తెస్తున్న వారి ధైర్యాన్ని మెచ్చుకున్నారు. సమాచారాన్ని అందించడానికి తమ ప్రాణాలను పణంగా పెట్టిన జర్నలిస్టులకు కూడా నేను కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. సోదర సోదరీమణులారా, ఆ ప్రజల విషాదాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి సహాయపడుతున్న మీ సేవలకు ధన్యవాదాలు” అంటూ చెప్పుకొచ్చారు.పోప్ ఇప్పటివరకు హింస గురించి చేసిన వ్యాఖ్యల్లో.. ఇవి అత్యంత బలమైనవి. అయినప్పటికీ, ఎక్కడా రష్యా పేరుని ఎత్త‌లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement