Monday, May 13, 2024

‘శ్ర‌ద్ధాక‌పూర్’ కి ఊహించని గిఫ్ట్ ఇచ్చిన ఫ్యాన్స్

హీరోయిన్ శ్ర‌ద్దాక‌పూర్ బ‌ర్త్ డే రేపు. అయితే ఈ సంద‌ర్భంగా ఒక‌రోజు ముందునుంచే ఆమె ఫ్యాన్స్ శ్ర‌ద్ధాని స‌ర్ ప్రైజ్ కి గురి చేస్తున్నారు. శ్ర‌ద్ధా తన బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం ముంబాయిలో కాకుండా ఓ స్పెషల్ ప్లేస్ లో నిర్వహించుకోనుంది. ఇందుకోసం ముంబైలోని ఎయిర్ పోర్ట్ కు చేరుకుంది. ఈ సందర్భంగా శ్రద్ధా కపూర్ రాక కోసం ఎదురుచూస్తున్నడైహార్డ్ ఫ్యాన్స్ శ్రద్ధా కపూర్ ను కలిసి అడ్వాన్స్ గా బర్త్ డే విషేస్ తెలియజేశారు. ఆమెను సర్ ప్రైజ్ చేస్తూ మెమోరబుల్ గిఫ్ట్ అందించారు. శ్రద్ధా కపూర్ తన కేరీర్ లో చేసిన చిత్రాల కవర్ ఫొటోలను అల్బమ్ గా చేసి బహూకరించారు. అలాగే శ్రద్ధా బర్త్ డే కోసం ఓ గిఫ్ట్ ను స్పెషల్ గా తయారు చేయించి అందించారు. ఇందుకు శ్రద్ధా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ.. మీ అభిమానానికి ధన్యవాదాలు అంటూ ఎయిర్ పోర్ట్ లోపలికి వెళ్లిపోయింది. తన తండ్రి శక్తి కపూర్ కూడా శ్రద్ధా కపూర్ వెంట బర్త్ డే సెలబ్రేషన్స్ కు వెళ్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement