Sunday, April 28, 2024

రిటైర్మెంట్ అయిన పోలీసుల‌కు అండ‌గా ఉంటాం : విన‌య్ భాస్క‌ర్

రిటైర్మెంట్ అయిన పోలీసులకు అన్ని రకాలుగా అండగా ఉంటామని ప్రభుత్వ ఛీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. హన్మకొండలోని స్థానిక అంబేద్క‌ర్ భవన్ లో రిటైర్డ్ పోలీస్ అధికారుల సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, హనుమకొండ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, కమీషనర్ ఆఫ్ పోలీస్ డా.తరుణ్ జోషిలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సామాన్య ప్రజలకు అందుబాటులో సేవలు అందించే విధంగా చర్యలు తీసుకున్నామని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వరంగల్ జిల్లా పోలీసులకు మంచి గుర్తింపు ఉందన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 35 వేల మంది పెన్షన్ దారులున్నారని, అందులో హనుమకొండ నగరంలోనే సుమారు 25 వేల మంది ఉంటారని, పోలీసు కుటుంబాలను తన స్వంత మనుషులుగా చూసుకుంటానని, వారికి ఎలాంటి సమస్యలు వచ్చిన అందుబాటులో ఉంటానాని చెప్పారు. వారికి కార్యాలయం ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును ఆయన కోరారు. అందుకోసం వారి సంక్షేమం కోసం తన వేతనం నుండి 1 లక్ష పదహారువేలు ఇస్తూ వారికి కేటాయించిన భవనం ఖర్చులు కూడా భరిస్తానన్నారు.

డా. తరుణ్ జోషి మాట్లాడుతూ… జిల్లాలో రిటైర్డ్ పోలీస్ అధికారులు వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో పోలీస్ జాబ్ నోటిఫికేన్లు వచ్చే అవకాశముంద‌ని, అందుకు అనుగుణంగా యువతకు అవగాహన కల్పించాలన్నారు. రిటైర్డ్ పోలీస్ అధికారులకు రావాల్సిన రిటైర్ మెంట్ బెనిఫిట్స్ తదితర సౌకర్యాలు కల్పించడానికి ఎప్పుడూ అందుబాటులో ఉంటానన్నారు. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ… జిల్లాలో రిటైర్డ్ పోలీస్ అధికారుల కార్యాలయం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని, ఉద్యోగులు సంక్షేమం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామన్నారు. రిటైర్డ్ ఉద్యోగులు ఈనెల లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాలని అన్నారు. ఏమైనా సమస్యలుంటే వెంటనే పరిష్కారిస్తామ‌న్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ట్రెజరీ అధికారి జీ.రాజు, స్థానిక కార్పొరేటర్ సోదా.కిరణ్, స్వరూపా రాణీ, రిటైర్డ్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు పులి.వీరారెడ్డి, నాయకులు జయపాల్ రెడ్డి, మస్తాన్, బాబు, కుమారస్వామి, సంజీవ రావు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement