Monday, May 13, 2024

గిన్నిస్ రికార్డ్ స్థాయిలో శాంతా క్లాజ్.. భారీ ఇసుక‌.. వంద‌ల కిలోల ట‌మాటాలు

గిన్నిస్ రికార్డ్ స్థాయిలో శాంతా క్లాస్ ని రూపొందించారు..దీనికోసం భారీగా ఇసుక‌..వంద‌ల కిలోల ట‌మాటాల‌ని ఉప‌యోగించారు. కేవలం ఇసుకతో అద్భుతమైన శిల్పాలు రూపొందించే ప్రముఖ సైకత శిల్పి నవీన్ పట్నాయక్ క్రిస్మస్ పండగ సందర్భంగా మరో అద్భుతాన్ని ఆవిష్కరించారు. క్రిస్మన్ అనగానే మనకు గుర్తువచ్చేది శాంటా క్లాజ్ (బహుమతులిచ్చే తాత). ఈ శాంతా క్లాజ్ బొమ్మలను చాలామంది ఇళ్లముందు పెట్టుకుంటుంటారు…

కానీ నవీన్ పట్నాయక్ మాత్రం ఇసుక, టమాటాలతో సరికొత్త శాంతా క్లాజ్ రూపొందిచాడు. ఒడిషాలోని గంజాం జిల్లా గోపాల్ పూర్ బీచ్ లో 27 అడుగుల ఎత్తు, 60 అడుగుల వెడల్పు భారీ శాతాక్లాజ్ సైకతశిల్పాన్ని రూపొందించారు నవీన్. ఇసుకతో పాటు 1500 కిలోల టమాటాలను ఉపయోగించి శాంతా క్లాజ్ ను అద్భుతంగా రూపొందించి భారత ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపాడు నవీన్. ప్రత్యేకమైన ఈ క్రిస్మస్ సైకత శిల్పాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కు పంపనున్నట్లు నవీన్ పట్నాయక్ వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement