Saturday, April 27, 2024

మీడియాపై ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేసిన స‌ల్మాన్ ఖాన్ – వీడియో ఇదిగో

మ‌రోసారి త‌న కోపాన్ని చూపించాడు బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్. షూటింగ్ పూర్తి చేసుకుని దుబాయ్ నుండి ముంబై ఎయిర్ పోర్ట్ లో సంద‌డి చేశాడు స‌ల్మాన్. అయితే అత‌నిని ఫొటోలు తీసేందుకు ఎగ‌బ‌డింది మీడియా. అస‌హ‌నంగా ఉండ‌టంతో స‌ల్మాన్ వారిపై విరుచుకుప‌డ్డాడు. ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్ వాయిస్ కూడా కాస్త బిగ్గరగా వినిపించడంతో అందరూ తమ కెమెరాలను ఆఫ్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. ప‌లువురు నెటిజ‌న్స్ స‌ల్మాన్ ది అంతా ఓవరాక్షన్ అని అంటున్నారు. స‌ల్మాన్ మూడ్ ఒక్కోసారి ఒక్కోలా ఉంటుంది. ఇప్ప‌టికే త‌న యాటిట్యూడ్ తో ఎన్నోసార్లు వార్త‌ల్లో నిలిచాడు.. త్వరలో సల్మాన్ ‘కభీ ఈద్ కభీ దివాలీ’, ‘కిక్ 2’, ‘దబాంగ్ 4’, ‘బజరంగీ భాయిజాన్’లో కనిపించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement