Friday, April 26, 2024

రాహుల్ గాంధీ పాద‌యాత్ర – క‌శ్మీర్ టు క‌న్యాకుమారి !

ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌పై కాంగ్రెస్ పార్టీ రాజ‌స్థాన్ లోని ఉద‌య్ పూర్ లో చింత‌న్ శివిర్ ని నిర్వ‌హిస్తుంది. ఈ సంద‌ర్భంగా ఆ పార్టీ అగ్ర‌ నేత రాహుల్ గాంధీ దేశవ్యాప్త పాద‌యాత్ర తెర‌పైకి వ‌చ్చింది. కాగా ఈ పాద‌యాత్ర సార్వ‌త్రిక ఎల‌క్ష‌న్ కి ముందు ..ఈ ఏడాది చివ‌రిలో ప్రారంభం కానుంద‌ని కాంగ్రెస్ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. రాహుల్ గాంధీ కశ్మీర్ నుంచి క‌న్యాకుమారి వ‌ర‌కు పాద‌యాత్ర చేయ‌నున్నార‌ట‌. ప్రజానుకూల అజెండాను ముందుకు తెచ్చేందుకు .. ప్రభుత్వ వైఫల్యాలను.. ప్రజల కష్టాలను ఎత్తిచూపడానికి రాష్ట్ర నాయకులు ప్రతి రాష్ట్రంలో ఇలాంటి పాదయాత్రలు నిర్వహించ‌నున్నారు. రాహుల్ పాద‌యాత్ర‌లో ఇవి భాగంగా కొన‌సాగ‌నున్నాయ‌ని తెలిసింది. కాశ్మీర్ నుంచి క‌న్యాకుమారి వ‌ర‌కు రాహుల్ గాంధీ చేప‌ట్టే పాద‌యాత్ర పై CWC తుది నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని కాంగ్రెస్ వ‌ర్గాలు చెప్పాయి. అయితే పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ద్రవ్యోల్బణం .. ఆర్థిక సమస్యలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామూహిక ఆందోళన కార్యక్రమం గురించి చర్చించారు. సోనియా గాంధీ చెప్పినట్లుగా రాహుల్ గాంధీ పాదయాత్ర సామరస్యంపైనే సాగుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ.. అతని సహచరులు కొన‌సాగిస్తున్న ప్రజా వ్య‌తిరేక పాల‌న గురించి ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తార‌ట‌. దేశం కాంగ్రెస్‌ పార్టీ వైపు చూస్తోందని, కాంగ్రెస్ వారు ఇక్కడ బయట నుండి ఐక్యత అనే సందేశాన్ని ఇవ్వాలని, అయితే పార్టీ వివిధ ఫోరమ్‌లలో స్వేచ్ఛగా మాట్లాడవచ్చని సోనియా అన్నారు. ఇక చింతన్ సివిర్ లో కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిని సైతం ఎన్నుకునే అవకాశాలున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement