Friday, April 26, 2024

రేపే రాధేశ్యామ్ ‘ట్రైల‌ర్’ రిలీజ్

డైరెక్ట‌ర్ రాధాకృష్ణ కుమార్ డైరెక్ష‌న్ లో రూపొందుతోన్న చిత్రం రాధేశ్యామ్. ఈ చిత్రంలో ప్ర‌భాస్, పూజాహెగ్డే జంట‌గా న‌టిస్తున్నారు. కాగా ఈ మూవీని మార్చి 11న విడుద‌ల చేయ‌నున్నారు. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో ఇదే రోజున ఈ సినిమాను విడుదల చేయనున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ వేగం పెంచుతున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఈ సినిమా నుంచి రిలీజ్ ట్రైలర్ ను రిలాజ్ చేయ‌నున్నారు. ఈ ట్రైలర్ తో మరింతగా అంచనాలు పెంచే కసరత్తు జరుగుతోంది. ఈ సినిమా తెలుగు వెర్షన్ కి జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్ని సమకూర్చాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను తమన్ అందించాడు. ప్రతి పాట మరో ప్రపంచంలోని తీసుకుని వెళుతుందని చెబుతుండటం అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రభాస్ తల్లిపాత్రలో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ భాగ్యశ్రీ నటించారు. ఇతర ముఖ్యమైన పాత్రల్లో కృష్ణంరాజు .. జగపతిబాబు కనిపించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement