Friday, December 6, 2024

Breaking: ఇబ్రహీంపట్నంలో రియల్టర్ హత్య : సెటిల్ మెంట్ కోసం పిలిచి కాల్పులు

భూముల ధరలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో వివాదాలు పెరిగిపోతున్నాయి. ఇందులో ఒకరినొకరు చంపుకునేందుకు కూడా వెనకాడటం లేదు. మంగళవారం ఇబ్రహీంపట్నం మండలం కర్ణంగూడ గ్రామ శివారు వద్ద శ్రీనివాస్ రెడ్డి…రఘు పై ప్రత్యర్థులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో రియల్టర్ శ్రీనివాస్ రెడ్డి అక్కడికక్కడే మరణించారు. తీవ్ర గాయాలపాలైన రఘును ఆసుపత్రికి తరలించారు. భూమి సెటిల్ మెంట్ చేసుకుందామని పిలిచి ప్రత్యర్థులు కాల్పులు జరిపారు. కాల్పులు ఎవరూ జరిపారనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement