Sunday, May 19, 2024

Election Code Effect : హైకోర్టును ఆశ్రయించిన లబ్ధిదారులు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్నికల వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు ఎన్నికల సంఘం అనుమతి నిరాకరించడంపై లబ్దిదారులు హైకోర్టును ఆశ్రయించారు. చేయూత కింద నిధుల విడుదలను ఈసీ అడ్డుకోవడంతో మహిళ సంఘాలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. లంచ్ మోషన్ కింద హైకోర్టు ఈ పిటిషన్ను విచారణ చేయనుంది.

దీంతో కోర్టు తీర్పుపై ఏపీ పొలిటికల్ సర్కిల్స్ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కాగా, ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో ప్రస్తుతం రన్నింగ్ పథకాల నిధుల విడుదలకు అనుమతి ఇవ్వాలని వైసీపీ సర్కార్ ఎలక్షన్ కమిషన్ కు లేఖ రాసిన విషయం తెలిసిందే. వైసీపీ గవర్నమెంట్ రిక్వెస్ట్ ను తిరస్కరించిన ఈసీ.. పథకాల అమలుకు పర్మిషన్ ఇవ్వలేదు. ఈ క్రమంలోనే లబ్ధిదారులు హైకోర్టును ఆశ్రయించారు. లబ్ధిదారుల పిటిషన్ పై హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement