Sunday, May 5, 2024

Medaram Jathara: రూ.10 కోట్లు దాటిన మేడారం హుండీ ఆదాయం..  

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 16-19 వరకు జరిగిన జాతరలో లక్షల సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. జాతర సందర్భంగా భక్తులు సమర్పించుకున్న కానుకల లెక్కింపు కొనసాగుతోంది. హనుమకొండలోని తిరుమల తిరుపతి దేవస్థానం కల్యాణ మండపంలో కానుకలను లెక్కిస్తున్నారు. ఇప్పటికే ఆదాయం రూ. 10 కోట్లు దాటింది. మొత్తం 497 హుండీలకు గాను ఇప్పటి వరకు 450 హుండీల లెక్కింపు పూర్తయింది.10,00,63,980 రూపాయల ఆదాయం లెక్క తేలింది. భక్తులు సమర్పించిన బంగారు, వెండి ఆభరణాలతోపాటు విదేశీ కరెన్సీ విలువను కూడా లెక్కించాల్సి ఉంది. నాణేల లెక్కింపు తర్వాత మొత్తం వివరాలను వెల్లడించనున్నట్టు అధికారులు తెలిపారు. కాగా, గత జాతరలో రూ. 11,64,00,000 ఆదాయం సమకూరగా, ఈసారి ఆ రికార్డు బద్దలయ్యే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement