Wednesday, May 22, 2024

Radhe Shyam: ‘రాధే శ్యామ్’ తొలి రోజు కలెక్షన్స్ ఎంతంటే..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డేల కాంబినేషన్ లో వచ్చిన ‘రాధేశ్యామ్’ సినిమా తొలిరోజు భారీ వ‌సూళ్లు రాబ‌ట్టింది. పాన్ ఇండియన్ మూవీగా తెరకెక్కిన రాధే శ్యామ్ మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. రొమాంటిక్ పీరియాడికల్ డ్రామాకి రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. పీరియాడిక్ ల‌వ్‌స్టోరిగా వ‌చ్చిన ఈ సినిమాకు తొలి రోజున మిక్స్‌డ్ టాక్ వ‌చ్చింది.  అయితే వ‌సూళ్ల పరంగా ‘రాధేశ్యామ్’ చ‌క్క‌గానే రాబ‌ట్టుకుంది. పాన్ ఇండియాలో ఈ సినిమాకు రూ.48 కోట్లు వ‌చ్చాయి. ఇక, తెలుగు రాష్ట్రాల్లో రూ.30 కోట్ల రూపాయ‌లు వ‌చ్చాయ‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి. ‘రాధే శ్యామ్’కు నైజాంలో తొలి రోజున షేర్ క‌లెక్ష‌న్స్‌గా రూ.10.45 కోట్లు వ‌చ్చినట్లు టాక్. ఓవర్సీస్ లోనూ ఈ సినిమా బాగానే వ‌సూళ్లు రాబ‌ట్టింది. అమెరికాలో ప్రీమియర్, తొలి రోజు కలెక్షన్లు కలిపి 1.4 మిలియన్ల డాలర్లు రాబ‌ట్టింది. 

కాగా, రూ.300 కోట్ల‌కు పైగా భారీ బ‌డ్జెట్‌తో రూపొందిన ‘రాధే శ్యామ్’ సినిమాలో రెబల్ స్టార్ కృష్ణంరాజు, జగపతి బాబు కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్‌ నిర్మించింది.  ఇట‌లీ, రోమ్‌, జార్జియా వంటి దేశాల్లో సినిమాను చిత్రీక‌రించారు. హై టెక్నిక‌ల్ వేల్యూస్‌తో రూపొందిన ఈ సినిమాని రాధాకృష్ణకుమార్ దర్శకత్వం వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement