Saturday, May 4, 2024

Vijayawada : జాబ్ క్యాలెండ‌ర్ విడుద‌ల చేయాల‌ని విద్యార్థి సంఘాల ఆందోళ‌న

జాబ్ క్యాలెండర్‌ విడుదల చేయాలని విజయవాడ ధర్నాచౌక్‌ వద్ద విద్యార్థి సంఘాల ఆందోళన చేపట్టాయి. ధర్నాచౌక్‌లో భారీగా మోహరించిన పోలీసులు.. అక్కడి చేరుకుంటున్న యువతను అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఖాళీ పోస్టులకు తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయడంతోపాటు.. ఉద్యోగం వచ్చేవరకు రూ.5 వేలు నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ యువజన సంఘాలు ధర్నాకు పిలుపునిచ్చాయి. మెగా డీఎస్సీ ద్వారా 25 వేల టీచర్‌ పోస్టుల భర్తీ చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పోరాడతామన్న విద్యార్థి సంఘం నాయకులు.. అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని అన్నారు. శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే అడ్డుకుంటారా అని ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి లేదు.. ఉద్యోగాలు లేవని ధ్వజమెత్తారు. ఉద్యోగాలపై హామీ ఇచ్చి ఓట్లు వేయించుకున్నారని.. 2.35 లక్షల ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ మాట తప్పి మోసం చేశారని విద్యార్థి సంఘం నాయకులు మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement