Saturday, May 28, 2022

టాలీవుడ్ లో ఆర్ ఆర్ ఆర్ ‘ప్రీ రిలీజ్ ఈవెంట్’ – గెస్ట్ లు ఎవ‌రో తెలుసా

ఆర్ ఆర్ ఆర్ రీసెంట్ గా బాలీవుడ్ కి సంబంధించి ముంబైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వ‌హించారు చిత్ర యూనిట్. కాగా ఈ ఈవెంట్ కి బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్, బాలీవుడ్ ప్ర‌ముఖ ద‌ర్శ‌క‌, నిర్మాత క‌ర‌ణ్ జోహార్ హాజ‌ర‌య్యారు. ఇప్పుడు టాలీవుడ్ లో ఆర్ ఆర్ ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వ‌హించేందుకు ఈ చిత్ర యూనిట్ ప్లాన్ వేస్తుంది. ఈ ఈ వెంట్ కి ముఖ్య అతిథులుగా మెగాస్టార్ చిరంజీవి, నంద‌మూరి బాల‌కృష్ణ రానున్న‌ట్లు స‌మాచారం. జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కాబోతోంది. రాజ‌మౌళి ప్ర‌తిష్టాత్మ‌కంగా భారీ బ‌డ్జెట్ తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తుండ‌గా .. స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో అలియా భట్, అజయ్ దేవగణ్, శ్రియ, సముద్రఖని తదితరులు ప్రధాన పాత్రలను పోషించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement