Thursday, April 18, 2024

జోన‌ల్, మ‌ల్టీ జోన‌ల్ విభజ‌న షురూ..

జిల్లా స్థాయిలో ఉద్యోగుల విభజన పూర్తి చేసిన కలెక్టర్లు అన్ని జిల్లాల్లో అలాట్‌మెంట్‌ ఆర్డర్లను కూడా అందజేశారు. ఇక రెండు రోజులుగా జోనల్‌ పోస్టుల అలాట్‌మెంట్‌ కసరత్తు తీవ్రమైంది. కేడర్‌స్ట్రెంగ్త్‌, రోస్టర్‌ పాయింట్లు, వర్కింగ్‌ పోస్టులు, క్లీయర్‌ ఖాళీలపై మదింపు మొదలు పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అన్ని శాఖల్లో ఉద్యోగులకు జిల్లాల కేటాయింపు పూర్తయింది. దీంతో 60వేలకుపైగా ఉద్యోగులను వారి ఆప్షన్ల ఆధారంగా వివిధ జిల్లాలకు కేటాయించారు. ఇందులో సీనియార్టీ తక్కువగా ఉన్న జూనియర్లు ఇతర జిల్లాలకు తరలివెళ్లగా, సీనియర్లు ప్రస్తుత స్టేసన్లు, జిల్లాలకే అలాట్‌ అయినట్లు సమాచారం. అలాట్‌మెంట్‌ ఆర్డర్లు అందుకున్న ఉద్యోగు లకు ఆయా నిర్దేవిత జిల్లాల్లో రిపోర్టు చేసేందుకు ప్రభుత్వం వారం రోజుల గడువును ఇచ్చింది.

ఈ ప్రక్రియలో కీలకమైన జోనల్‌, మల్టి జోనల్‌ పోస్టులతో కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇందులో భాగంగా ఉద్యోగులు అందించిన మెడికల్‌ రీజన్స్‌, కుల, స్పౌజ్‌ పత్రాల వెరిఫికేషన్‌ మంద కొడిగా సాగుతోంది. సీనియార్టీని ప్రాతిపదికగా తీసుకుంటున్న కారణంగా స్థానికేతరులకు కూడా ప్రాధాన్యత దక్కే అవకాశాలున్నాయని అంటున్నారు. జీవో 317లో కొత్త జిల్లాల స్థానిక అంశం పక్కనపెట్టి సర్వీస్‌ సీనియార్టీకే ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చింది. దీనిని ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ నిబంధన కారణంగా సొంత జిల్లాను వదిలి మరో జిల్లా, మరో జోన్‌లోకి వెళ్లాల్సి వస్తుందన్న ఆరోపణలు వినబడుతున్నాయి.

స్థానికేతర కోటాలో చేరినవారుకూడా వారు ఇచ్చే ఆప్షన్‌ ప్రకారం జిల్లాలకు కేటాయిస్తారు. స్థానికులైనప్పటికీ తక్కువ సీనియార్టీ ఉన్న స్థానిక ఉద్యోగులు మరో కొత్త జిల్లాకు వెళ్లాల్సి ఉంటుంది. దీంతో వారు శాశ్వతంగా సొంత జిల్లాకు దూరం అవుతారని అంటున్నారు. దీంతో మిగిలిన సర్వీస్‌ అంతా అదే జిల్లాకు పరిమితం కానుంది.ప్రభుత్వం నూతన జోనల్‌ విధానంలో బాగంగా 95శాతం స్థానికులకే ఉద్యోగ వాటా దక్కాలనే లక్ష్యంతో 2018 ఆగష్టు 30న జీవో 124 జారీ చేసింది. పాత ఉమ్మడి జిల్లాలనుంచి విడిపోయి ఏర్పడిన కొత్త జిల్లాల్లో పాత ప్రెసిడెన్షియల్‌ ఆర్డర్స్‌ 1975 ప్రకారం ఆప్షన్లు తీసుకుం టున్నారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, మెదక్‌ వంటి ఉమ్మ డి జిల్లాల పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులు తమ సీని యార్టీ ప్రకారం పాత జిల్లా కేంద్రాలకు ఆప్షన్లు ఇచ్చారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement