Tuesday, April 23, 2024

రహస్య జీవోలపై ఏపీ సర్కార్ కు హైకోర్టు కీలక ఆదేశాలు

ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆన్ లైన్, రహస్య జీవోల వివరాలు తెలపాలని ఆదేశించింది. వెబ్‌సైట్‌లో జీవోలను ఉంచకపోవడంపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ తరఫున న్యాయవాది ఎలమంజుల బాలాజీ వాదనలు వినిపించారు. ప్రభుత్వం విడుదల చేసే జీవోల్లో 5 శాతం మాత్రమే వెబ్ సైట్‌లో పెడుతున్నారని తెలిపారు. అయితే, టాప్ సీక్రెట్ జీవోలు అప్‌లోడ్ చేయట్లేదని ప్రభుత్వ న్యాయవాది కోర్టకు వివరించారు. రహస్య జీవోలను ఆన్ లైన్ లో పెట్టకుండా ఉండే వెసులుబాటు ప్రభుత్వానికి ఉందని వాదించారు.

దీంతో జీవోలు సీక్రెట్, టాప్ సీక్రెట్ అని ఎలా నిర్ణయిస్తారని హైకోర్టు ప్రశ్నించింది. 2008 నుంచి సాఫీగా నడిచే ఆన్ లైన్ జీవో విధానంపై మార్పులు ఎందుకు తీసుకొచ్చారని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం ఎన్ని జీవోలు విడుదల చేసింది.. ఎన్ని జీవోలు వెబ్‌సైట్లో ఉంచింది.. సీక్రెట్ అంటూ అప్‌లోడ్ చేయని జీవోల వివరాలు ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement