Wednesday, May 8, 2024

పుతిన్ ఆరోగ్యం క్షీణిస్తోందా – ఆరోగ్య నిపుణుల నివేదిక‌లు ఏం చెబుతున్నాయ్

పుతిన్ ఆరోగ్యానికి సంబంధించి సిడ్నీకి చెందిన ఒక కాస్మోటాలజిస్ట్ నిన్న ఇన్‌స్టాగ్రామ్‌లో పుతిన్ కు చెందిన రెండు చిత్రాలను పోస్ట్ చేశాడు. ప్ర‌స్తుతం చిత్రంతో పాటు పాత చిత్రాన్ని పోలుస్తూ అవి ఉన్నాయి. ఆయ‌న శ‌రీర ఆకృతిని మార్చుకోవ‌డానికి స‌ర్జ‌రీలు చేసుకుని ఉంటారన్నారు. ఐ లిఫ్ట్‌తో సహా కాస్మెటిక్ ప్రక్రియలకు గుర‌య్యాడ‌నే పుకార్లు వచ్చాయి. కఠినమైన వ్యక్తిగా తన ఇమేజ్‌ను పెంచుకోవడానికి .. అతని వయస్సు అడ్డంకిగా మారకుండా నిరోధించడానికి అతను ఇలా చేసాడు అని నిపుణులు అంటున్నారు. పుతిన్ ఉబ్బిన ముఖం .. మెడ అతను స్టెరాయిడ్ చికిత్స పొందుతున్నట్లు వాదనలకు దారితీసింది. అదే సమయంలో పుతిన్ నిరంతరంగా థైరాయిడ్ క్యాన్సర్‌లో నిపుణుడైన వైద్యునితో కలిసి ఉన్నట్లు నివేదికలు సూచించాయి. ఉక్రెయిన్‌పై దాడి బలహీనపడటం వల్ల షోయిగు .. పుతిన్‌ల ఆరోగ్యం బాగాలేదని తెలిపారు.రష్యా అధ్యక్షుడి ఆరోగ్యంపై వచ్చిన నివేదికలపై వ్యాఖ్యానించబోమని వైట్ హౌస్ తెలిపింది. పుతిన్ ఆరోగ్యంపై తక్షణ అంచనా లేదా అభిప్రాయం లేదు అని ప్రెస్ సెక్రటరీ జెన్ జాకీ అన్నారు. ఉక్రెయిన్‌తో యుద్ధం జరుగుతున్న సమయంలో రష్యా అధ్యక్షుడి గురించి ఇలాంటి కథనాలు రావడం గమనార్హం.

పుతిన్ ఆరోగ్యంపై అంతర్జాతీయ మీడియా, ఆరోగ్య నిపుణులు పలు నివేదికలు విడుదల చేశారు. ఇటీవలి చర్చలో పుతిన్ కనిపించడం అతని శరీర ఆకృతిలో మార్పులతో గుర్తించబడిందని చాలా మంది ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు. అలాగే, పుతిన్ చేతులు వ‌ణుకుతున్న వీడియోల‌ను పంచుకున్నారు. కాస్మెటిక్ సర్జరీ చేయించుకున్నట్లుగానే ఆయన ముఖం కనిపిస్తోందని అంటున్నారు.ఆ దేశ ఒలింపిక్ అథ్లెట్లకు అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో రష్యా అధ్యక్షుడు ఫోటో దిగుతూ ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు కనిపించారని న్యూయార్క్ పోస్ట్ పేర్కొంది. బెలారసియన్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకోతో సమావేశం సందర్భంగా.. పుతిన్ తన శరీరాన్ని టేబుల్‌కు గట్టిగా పట్టుకుని కనిపించారు. అలాగే, లుక‌షెంకోను ఆహ్వానిస్తున్న స‌మ‌యంలో అత‌నికి న‌మ‌స్క‌రించాల‌ని భావించిన ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ చేతులు అనియంత్రంగా వ‌ణుకుతున్నాయి. దీంతో ఆయ‌న త‌న చేతిని ఛాతీకి దగ్గరగా పెట్టుకున్నారు.. అయిన‌ప్ప‌టికీ.. ఆయ‌న చేతులు వణుకుతున్నాయని న్యూస్ వీక్ నివేదించింది.
చాలా మంది ట్విట్టర్ యూజ‌ర్స్ పుతిన్‌కు పార్కిన్సన్స్ వ్యాధి ఉండవచ్చని భావిస్తూ.. ట్వీట్ చేస్తున్నారు.పార్కిన్సన్స్ వ్యాధి శ‌రీర క‌ద‌లిక‌ల‌ను ప్ర‌భావితం చేస్తుంది. నాడీ వ్య‌వ‌స్థ‌కు సంబంధించిన రుగ్మ‌త ఇది.

Advertisement

తాజా వార్తలు

Advertisement