Thursday, May 2, 2024

Big Story | సరిహద్దుల్లో పెద్దవాగు జలాశయం.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు నీటిలో వాటా!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఏపీ, తెలంగాణ‌ రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న పెద్దవాగు జలాశయం పునరుద్ధరణకు తెలంగాణ ప్రభుత్వం డీపీఆర్‌ ను రూపొందించింది. గోదావరినది యాజమాన్యం బోర్డు పరిధిలో ఉన్న ఈ ప్రాజెక్టు విస్తరణకు ఉన్న అడ్డంకులు తొలగడంతో ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచి గిరిజన తండాల భూముల్లో గోదావరి జలపరవళ్లు తొక్కేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఆంధ్ర, తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న ఏకైక ప్రాజెక్టు పెద్దవాగు జలాశయం విస్తరణకు ఏపీ సానుకూలంగా ఉండటంతో ఎలాంటి వివాదాలకు అవకాశాలు లేకపోవడంతో సామర్ధ్య విస్తరణకు విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.

భద్రాద్ర కొత్తగూడోంలోని గుమ్మడపల్లి వద్ద..

పెద్దవాగు మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు గుమ్మడపల్లి గ్రామంలోపెద్దవాగుపై ఉంది. భద్రాద్రి కొత్తగూడెంజిల్లాలోని అశ్వారావు పేట మండలం నుంచి 20 కిలోమీటర్ల పరిదిలో ఉంది. ఈ ప్రాజెక్టు తో అశ్వారావు పేట మండలం పరిదిలోని అనేక గిరిజన తండాలకు సాగునీటి తో పాటుగా తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. అయితే గత ఉమ్మడి పాలనలో ఈ ప్రాజెక్టును నిర్లక్ష్యంచేయడంతో ప్రాజెక్టుకు సంబంధించిన ప్రధాన కాలువ తో పాటుగా పంటకాలువలు పూరుకు పోయాయి. రాష్ట్ర విభజనతో ఈ ప్రాజెక్టు పరిదిలోని భూములు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు చెందడంతో ఇరురాష్ట్రాలు ప్రాజెక్టు అభివృద్ధి పై దృష్టి సారించాయి.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు పెద్దవాగు ప్రాజెక్టు పై హక్కు ఉండటంతో ఈ ప్రాజెక్టును అంతరాష్ట్ర ప్రాజెక్టుగా గోదావరి నీటి యాజమాన్యం బోర్డు గుర్తించి తనపరిదిలోకి తీసుకుంది. గోదావరికి ఉపనది పెద్దవాగు వేసవిలోను ఊటల నీటితో ప్రవహిస్తుండటంతో ఈ ప్రాజెక్టుకు ప్రాధాన్యత ఏర్పడింది. ప్రాజెక్టును పునరుద్ధరిస్తే ఖరీఫ్‌ తో పాటుగా యాసంగిలోను రెండు రాష్ట్రాలకు ప్రయోజనం ఏర్పడుతుంది.

- Advertisement -

1981లో నిర్మించినా ప్రాజెక్టుపై నిర్లక్ష్యం..

పెద్దవాగు మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టు 1981లో నిర్మించినప్పటికీ ప్రాజెక్టు ను నిర్లక్ష్యం చేయడంతో ప్రతిపాదిత నీటి వినియోగం వేల ఎకరాల్లో తగ్గి పోయింది. ప్రధానంగా ఈ ప్రాజెక్టు ద్వారా ఎగువప్రాంతాలకు నీటి సౌకర్యం ఉండగా ప్రాజెక్టు కాలువలు పూరుకుపోవడంతో దిగువకు కూడా నీరు అందించే పరిస్థితిలో ప్రస్తుతంలేదు. అయితే 1981లో నిర్మించిన ఈ ప్రాజెక్టును పునరుద్ధరిస్తునే రెండవ దశపనులు చేపట్టాలని తెలంగాణ భావిస్తూ డిపీఆర్‌ ను రూపొందించింది. ఈ డీపీఆర్‌ ను గోదావరి నదీ యాజమాన్యం బోర్డు అంగీకారంతో పనులు ప్రారంభించారు.

16వేల ఎకరాలకు సాగునీరు అందేలా..

ప్రాజెక్టు సామర్ధ్యం 16వేల ఎకరాలుగా నిర్ణయించి 1981లో పనులను పూర్తి చేశారు. అయితే నిర్మాణం అనంతరం సామర్ధ్యం మేరకు సాగునీరు అందలేదు. కాలువలు చిన్నవిగా ఉండటం ప్రవాహవేగానికి తగ్గట్టుగా నిర్మాణం లేకపోవడంతో సమస్యలవలయంలో చిక్కుకుంది. ప్రస్తుతం డిస్ట్రి బ్యూటరీస్‌ సిఎం అండ్‌ సిడి పనులు పూర్తిగా శిథిలమయ్యాయి. నీరు చివరి ఆయకట్టుకు చేరుకోవడంలేదు. కనీసుం 9 వేల ఎకరాలకు కూడా నీరు అందని దీన స్థితిలో ఉన్న పెద్దవాగు ప్రాజెక్టు పై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేద దృష్టి సారించింది. తొలుత తెలంగాణకు అందాల్సిన 16వేల ఎకరాల సామర్ధ్యాన్ని పునరుద్ధరించి సాగునీటిని సరఫరా చేసేందుకు పనులు ప్రారంభించారు.

నీటి పంపకాలకు ఏపీ, తెలంగాణ అంగీకారం..

రాష్ట్రంలోని తండాల్లోని సాగుభూములకు నీరు అందనుంది. విభజన చట్టంమేరకు నీటి పంపకాలకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు అంగీకరించడంతో తెలంగాణ రాష్ట్రంలోని భూభాగాలకు నీటి సౌకర్యాలు కల్పించేందుకు పనులు మొదలు పెట్టింది. నీటివాటాలపై గోదావరి యాజమాన్యం బోర్డు సమక్షంలో తెలుగురాష్ట్రాల మధ్య అంగీకారం కుదిరింది. తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టు మొదటి దశ పునరుద్ధరణ కోసం రూ. 78కోట్ల26 లక్షల పరిపాలనా పరమైన అనుతులు ఇచ్చింది. అలాగే రెండవదశ నిర్మాణ పనులకోసం తెలంగాణ ప్రభుత్వం రూ. 6కోట్ల 17 లక్షల ప్రతిపాదనలను అంగీకరించింది. ఈ నిధులతో తెలంగాణ ప్రాంతంలోని భూముల్లో ప్రవహిస్తున్న కాలువల మరమ్మత్తులు చేయనున్నారు. అలాగే పెద్దవాగు ప్రాజెక్టు హెడ్‌ వర్క్‌ మరమ్మత్తులు, సిల్ప్‌ వే గేట్‌లకు పేయింటింగ్‌, హూయిస్ట్‌ మొకానిజం అమలు నిర్వహణ కోసం రూ.కోటీ 40 లక్షలకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనపరమైన ఆమోదం తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement