Sunday, May 5, 2024

సునీల్ అండ్ కో భువ‌న విజ‌యం….

సునీల్‌, శ్రీనివాస్‌ రెడ్డి, వెన్నెల కిషోర్‌, ధనరాజ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘భూవన విజయమ్‌’. యలమంద చరణ్‌ దర్శకత్వంలో కిరణ్‌, విఎస్కే నిర్మిస్తున్న చిత్రమిది. ఈ చిత్రం నుండి ఇప్పటికే టీ-జర్‌, థీమ్‌ సాంగ్‌ బర్త్‌ అఫ్‌ భువన విజయమ్‌ సినిమా పై ఆసక్తిని పెంచాయి. తాజాగా మేకర్స్‌ విడుదల తేదిని ప్రకటించారు. మే12న భువన విజయమ్‌ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. శ్రీమతి లక్ష్మీ సమరిస్తున్న ఈ చిత్రంలో గోపరాజు రమణ, రాజ్‌ తిరందాసు, జబర్దస్త్‌ రాఘవ, అనంత్‌ , సోనియా చౌదరి, స్నేహల్‌ కామత్‌, పృథ్వీ, షేకింగ్‌ శేషు, సత్తి పండు తదితరులు నటిస్తున్నారు. శేఖర్‌ చంద్ర సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సాయి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఛోటా కె ప్రసాద్‌ ఎడిటర్‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement