Sunday, May 19, 2024

Regina : ఫ్యాష‌న్ డ్రెస్ లో….

చెన్నై సోయ‌గం రెజీనా సోష‌ల్ మీడియా యాక్టివిటీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త ఫోటోల‌తో కొంగొత్త‌గా కుర్రాళ్ల‌ని ఆక‌ర్షిస్తుంటుంది. ఫ్యాష‌న్ ఎంపిక‌ల్లో త‌నదైన మార్క్ త‌ప్ప‌నిస‌ర‌ని ప్రూవ్ చేసిన సంద ర్భాలెన్నో. త‌మిళ సోయ‌గాల్లో తానో స్పెష‌ల్ గా ఫోక‌స్ అవుతుంది. బేసిక్ గా కోలీవుడ్ భామ‌లు గ్లామ‌ర్ షోకి కొన్ని ప‌రిమిత‌లంటూ మెయింటెన్ చేస్తుంటారు. కానీ రెజీనా మాత్రం ఆ విష‌యంలో బాలీవుడ్ భామ‌ల‌కే ధీటుగా నిలుస్తుంది.

- Advertisement -

ఆరంభంలో మ‌డిక‌ట్టి కూర్చున్నా! కాల‌క్ర‌మంలో ట్రెండ్ ని ఫాలో అవుతూ డిజైన‌ర్ దుస్తుల్లో ట్రెండ్ నే సృష్టించే స్థాయికి ఎదిగింది. చేతిలో స‌క్సెస్ లున్నా లేక‌పోయినా ఇప్ప‌టికీ మార్కెట్ లో బ్రాండ్ గా కొన‌సాగుతుందంటే?ఆ క్వాలిటీ కూడా ఓ కార‌ణంగా చెప్పొచ్చు. తాజాగా మ‌రో ఫోటోతో నెటి జ‌నుల ముందుకొచ్చేసింది. ఇదిగో ఇక్క‌డిలా బ్లూ అండ్ వైట్ కాంబినేష‌న్ లో అమ్మ‌డి స్టైలిష్ లుక్ ఇంట్రెస్టింగ్. అమ్మ‌డు టాప్ టూ బాట‌మ్ ఎంపిక చేసుకున్న యాక్స‌రసీస్ మ‌రింత స్టైలిష్ గా తీర్చిదిద్దాయి.
హైహీల్స్ ని త‌ల‌పించేలా షూస్ ధ‌రించింది.

న‌డి నెత్తిన స్పాట్ లైట్..బ్యాక్ గ్రౌండ్ బ్యూటీ ప్ర‌తీది రెజీనా బ్యూటీని ఫోక‌స్ చేస్తున్నాయి. వివిధ భంగిమ‌ల్లో కెమెరాకి ఫోజులు నెట్టింట వైర‌ల్ గా మారాయి. వాట్ ఈజ్ యుర్ టైప్ అంటూ ఫోటోని ఉద్దేశించి ఓ క్యాప్ష‌న్ కూడా పోస్ట్ చేసింది. దీంతో కామెంట్ బాక్సులో నెటి జ‌నుల పోస్టులు అంతే ఇంట్రెస్టింగ్ గా క‌నిపిస్తున్నాయి. లుక్స్ గార్జియ‌స్…సో బ్యూటీఫుల్ అంటూ అమ్మ‌డి అందాన్ని పొగ‌డ్త‌ల‌తో రెట్టింపు చేసేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement