Wednesday, May 8, 2024

భారత్ లో ఫోర్త్ వేవ్ లేనట్టే: ప్రఖ్యాత వైరాలజిస్ట్ స్పష్టీకరణ

భారత్ లో కరోనా మహమ్మారి పూర్తిగా తగ్గుతోంది. తొలి మూడు దశల్లో కరోనా విజృంభించింది. అయితే, ఫస్ట్, సెకండ్ వేవ్ లతో పోల్చితే థర్డ్ వేవ్ లో కేసులు, మరణాలు తగ్గాయి. ఈ క్రమంలో ఫోర్త్ వేవ్ కూడా ఉంటుందనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే, కరోనా వైరస్ భయాలు ఇకలేనట్టేనని ప్రముఖ వైరాలజిస్ట్ డాక్టర్ డి.జాకోబ్ జాన్ అన్నారు. దేశంలో కరోనా మూడోదశ ముగిసిందని, ఇక నాలుగో దశ భయాలు అక్కర్లేదని స్పష్టం చేశారు. పూర్తిగా భిన్నమైన వేరియంట్ వస్తే తప్ప నాలుగో వేవ్ ఆందోళన అక్కర్లేదని చెప్పారు. ఆల్ఫా, బీటా, గామా లేదా ఓమిక్రాన్ నుండి భిన్నంగా ప్రవర్తించే ఊహించని వేరియంట్ వస్తే తప్ప, నాల్గవ వేవ్ ఉండదు అని అన్నారాయన. గతంలో వచ్చిన శ్వాసకోశ సంబంధిత వ్యాధులన్నీ ఇన్‌ఫ్లూయెంజా కారణంగానే వచ్చాయని, ప్రతి ఇన్‌ఫ్లూయెంజా రెండు, మూడు దశల తర్వాత ముగిసిందని డాక్టర్ జాన్ గుర్తు చేశారు.

కాగా, భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్)కి చెందిన వైరాలజీ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ సెంటర్‌కు డాక్టర్ జాన్ గతంలో డైరెక్టర్‌గా పనిచేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement