Saturday, May 4, 2024

Gold Rate: పసిడి ప్రియులకు ఊరట.. నేటి బంగారం ధర ఇలా..

బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి స్వల్ప ఊరట. నిన్న భారీగా పెరిగిన బంగారం ధర నేడు స్థిరంగా కొనసాగుతోంది. ఇవాళ్టి బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. అయితే, వెండి ధర మాత్రం భారీగా దిగివచ్చింది. హైదరాబాద్ మార్కెట్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 53,890 వద్దనే కొనసాగుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 49,400 వద్దనే ఉంది. బంగారం ధరలు నిలకడగా ఉంటే.. వెండి రేటు మాత్రం ఏకంగా రూ.1,100 దిగొచ్చింది. దీంతో కేజీ వెండి ధర రూ. 74,600గా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement