Saturday, April 27, 2024

ఏప్రిల్‌ 1నుంచి పెరగనున్న మెడిసిన్స్​ ధరలు.. 800 ఔషధ ధరలకు రెక్కలు

దేశవ్యాప్తంగా ఇప్పటికే పెట్రోధరలు, వంటనూనె ధరలు, వంటగ్యాస్‌ ధరలు విపరీతంగా పెరిగాయి. వీటితోపాటు మనిషి అనారోగ్యం బారిన పడితే కొనుగోలు చేసే ఔషధాల ధరలు కూడా పెరగబోతున్నాయి. ఏప్రిల్‌ 1 నుంచి పారాసిటమాల్‌ సహా రోజూవారీ ఉపయోగించే 800 ఔషధాల ధరలు పెరగనున్నట్లు జాతీయ ఫార్మాస్యూటికల్‌ ప్రైసింగ్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీపీఏ) ప్రకటించింది. పలు మెడిసిన్స్‌ ధరలు 10శాతం పెరగనున్నట్లు తెలిపింది. పెయిన్‌ కిల్లర్లు, యాంటీబయాటిక్స్‌, యాంటీ ఇన్ఫెక్టివ్‌లతో సహా అవసరమైన మందుల ధరలు పెరగబోతున్నాయి. అదేవిధంగా జ్వరం, ఇన్ఫెక్షన్స్‌, గుండె జబ్బులు, హైబీపీ, చర్మ వ్యాధులు, ఎనీమియా చికిత్సకు ఉపయోగించే ఔషధాల ధరలు పెరగనున్నాయి.

ఈ మేరకు ప్రజలు ఎక్కువగా వినియోగించే పారాసిటమాల్‌, ఫెనోబర్బిటోన్‌, అజిత్రోమైసిన్‌, సిఫ్రాన్‌, హైడ్రోక్లోరెడ్‌, మెట్రిండజోల్‌ వంటి మందుల ధరలు ప్రజలకు భారం కానున్నాయి. 2021 క్యాలెండర్‌ సంవత్సరం హోల్‌సేల్‌ ప్రైస్‌ ఇండెక్స్‌ (డబ్ల్యూపీఐ)లో 10.7 శాతం సవరించినట్టు ఎన్‌పీపీఏ అధికారులు వెల్లడించారు. కరోనా కారణంగా ఔషధాల తయారీ ఖర్చులు కూడా పెరగడంతో వాటి ధరలు పెరగనున్నట్లు తెలుస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి...

Advertisement

తాజా వార్తలు

Advertisement