Thursday, May 2, 2024

రాధేశ్యామ్ నుండి ‘హిందీ’ వ‌ర్ష‌న్ సాంగ్

రాధేశ్యామ్ చిత్రం నుండి హిందీ వ‌ర్ష‌న్ సాంగ్ రిలీజ్ అయింది. ఈ సాంగ్ మెయిన్‌ ఇష్క్ మే హూన్” అనే లిరిక్స్‌ తో ప్రారంభం అవుతుంది. ఇక ఈ సాంగ్‌ లో ప్రభాస్‌, పూజా హెగ్డే చాలా అందంగా కనిపించారు. లవ్‌, ఎమోషనల్‌ ఫీలింగ్‌ ఇద్దరూ అలరించారు. దీని ఫుల్‌సాంగ్ రేపు విడుదల కానుంది. కాగా సినిమా మార్చి 11న విడుదల కానుంది.. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా ను టాలీవుడ్‌ యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ రాధాకృష్ణ డెరెక్ట్‌ చేస్తున్నాడు. ఈ సినిమా యూవీ క్రియేషన్స్‌ సమర్పణ లో తెరకెక్కతోంది. 1960 నాటి వింటేజ్‌ ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం లో ప్రభాస్‌ టాలీవుడ్ బుట్ట‌బొమ్మ పూజాహెగ్డే జంటగా న‌టిస్తుంది.భారీ బడ్జెట్‏ మూవీగా యూవీ క్రియేషన్స్, టీసిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీద సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement