Sunday, October 6, 2024

కత్తితో దాడి : యువకుడు మృతి

దర్శి: దర్శి మండలం నడింపల్లి కొత్తూరు వద్ద ఓ యువకుడి పై కొందరు వ్యక్తులు కత్తితో దారుణంగా దాడికి పాల్పడ్డారు. తీవ్ర గాయాలపాలైన యువకున్ని దర్శి ప్రభుత్వ హాస్పిటల్ కి తరలిస్తుండగా మార్గమద్యంలో మృతి చెందాడు. ఈ ఘటనపై ఎస్ఐ చంద్రశేఖర యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం… దర్శి మండలం వెంకటచలం పల్లి పంచాయితీ నడింపల్లి గ్రామంలో పుప్పాల సత్యనారాయణ అనే యువకుడిపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడగా, యువకుడు మృతి చెందాడని, ఈ ఘటన పై మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు. దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని దర్శి ఎస్ఐ చంద్రశేఖర్ తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement