Friday, April 26, 2024

ఏపీలో కరోనా విజృంభణ.. ఒక్క చిత్తూరు జిల్లాలోనే 719 కేసులు

ఏపీలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 31,719 కరోనా పరీక్షలు నిర్వహించగా 3,495 మందికి పాజిటివ్ అని తేలింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 719 కొత్త కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో 501, విశాఖ జిల్లాలో 405, కృష్ణా జిల్లాలో 306, శ్రీకాకుళం జిల్లాలో 293, ప్రకాశం జిల్లాలో 215, అనంతపురం జిల్లాలో 209, విజయనగరం జిల్లాలో 193, కడప జిల్లాలో 192, కర్నూలు జిల్లాలో 191, నెల్లూరు జిల్లాలో 190, తూ.గో. జిల్లాలో 41, ప.గో. జిల్లాలో 40 మందికి కరోనా సోకినట్టు గుర్తించారు. గత 24 గంటల్లో 1,198 మంది కరోనా నుంచి కోలుకోగా చిత్తూరు జిల్లాలో నలుగురు, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, శ్రీకాకుళం, కర్నూలు జిల్లాలలో ఒక్కొక్కరు చొప్పున కరోనాతో మరణించారు. ఏపీలో ఇప్పటివరకు 9,25,401 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,97,147 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అటు యాక్టివ్ కేసుల సంఖ్య కూడా 20,954గా నమోదైంది. కరోనా మరణాల సంఖ్య 7,300గా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement