Thursday, May 6, 2021

వనదుర్గామాతను దర్శించుకున్న భక్తులు..

పాపన్నపేట : ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గాభవాని మాతను భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలు ప్రాంతాల నుండి ఏడుపాయలకు చేరుకున్న భక్తులు వివిధ మంజీరా పాయల్లో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. పలువురు ఓడిబియ్యం, కుంకుమార్చనలు, తలనీలాలు సమర్పించుకొని మొక్కులు చెల్లించగా మరికొందరు అమ్మవారికి బోనాలు సమర్పించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కరోనా నిబంధనలు పాటించేలా ఏడుపాయల ఈవో సార శ్రీనివాస్‌ చర్యలు చేపట్టారు. ఇదిలా ఉండగా వేద బ్రహ్మణులు నరసింహ్మాచారి, శంకర్‌శర్మ, పార్థివశర్మ, రాముశర్మ తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాపన్నపేట ఎస్‌ఐ సురేష్‌ ఏడుపాయల్లో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా తగిన బందోబస్తు చర్యలు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News