Wednesday, May 8, 2024

క‌మ‌లాదేవీ చటోపాధ్యాయ ఎన్ఐఎఫ్ బుక్ ప్రైజ్ 2021కి.. దిన్యార్స్ ప‌టేల్ నౌరోజి పుస్త‌కం ఎంపిక‌

దిన్యార్స్ ప‌టేల్ రాసిన నౌరోజి – ప‌య‌నీర్ ఆఫ్ ఇండియ‌న్ నేష‌న‌లిజం పుస్త‌కం 2021కి గాను కమ‌లాదేవీ చటోపాధ్యాయ ఎన్ఐఎఫ్ బుక్ ప్రైజ్‌కు ఎంపికైంది. ప్ర‌స్తుత గుజ‌రాత్‌లోని నవ్సారి ప్రాంతంలో 1825లో దాదాభాయి నౌరోజి జ‌న్మించారు. భారతదేశ కురు వృద్ధుడు (Grand Old Man of India). భార‌త స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు. జాతీయ‌వాది. స‌మాన‌త్వం కోసం పోరాడారు ఈయ‌న‌. ఓ ప్రొఫెస‌ర్‌గా జీవితం ప్రారంభించిన నౌరౌజి.. యూనివ‌ర్సిటీల‌కు పాల‌కులను ఏర్పాటు చేయాల‌ని సూచించారు.

బ్రిటిషు పార్లమెంట్‌కు ఎన్నికైన తొలి భారతీయుడు కూడా నౌరౌజి. ఇతను 1892లో బ్రిటిష్ కామన్స్ సభకు కేంద్ర ప్రిన్స్‌బ‌రీ నియోజకవర్గం నుంచి లిబరల్ పార్టీ తరుపున ఎన్నికై 1892 నుండి 1895 వరకు సభ్యుడిగా ఉన్నారు. ఎంపీగా ఉన్న స‌మ‌యంలో ఇండియ‌న్ సివిల్ స‌ర్వీసుల్లో మార్పులు చేసేలా తీర్మానాన్ని కూడా ఆమోదించారు. భారతదేశ పేదరికపు లెక్కలను వేశారు. భారతదేశపు మొదటి ఆర్థిక సిద్ధాంత క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రించారు. ఆర్థిక సంపద తరలింపుపై సిద్ధాంతమును ప్రవేశపెట్టాడు. డ్రెయిన్ సిద్ధాంత రూపకర్త ఈయ‌నే కావ‌డం గ‌మ‌నార్హం..

నౌరోజి వార్తాపత్రికలు, ర‌చ‌న‌లు, స్థాపించిన సంస్థ‌లు..

వాయిస్ ఆఫ్ ఇండియా (లండన్‌లో – ఇంగ్లిష్‌లో)
రస్త్ గోఫ్త‌ర్ – 1884 (మహారాష్ట్రలో – పార్శీ భాషలో)
రస్త్ గోఫ్త‌ర్ (Rast goftar)కు మరో పేరు Truth teller
పుస్తకము – పావ‌ర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా (Poverty and Unbritish Rule in India)
సంస్థలు – లండ‌న్ – ఈస్ట్ ఇండియా అసోసియేషన్‌, పార్శీ రిఫార్మ్ అసోసియేష‌న్ (మ‌హారాష్ట్ర‌లో పార్శీ సంస్క‌ర‌ణం)

Advertisement

తాజా వార్తలు

Advertisement