Saturday, May 25, 2024

పుణ్యక్రేత్రాల సందర్శనకు జ‌నసేనాని.. కరీంనగర్ జిల్లా ప‌ర్య‌ట‌న‌కు ఏర్పాట్లు

తెలంగాణ, ఏపీ ప్రజల అభివృద్ధి, వారి శ్రేయస్సును ఆకాంక్షిస్తూ ‘అనుష్టుప్ నారసింహ దర్శన యాత్ర’ చేపట్టాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంకల్పించారు. ఈ క్రమంలో ఉమ్మడి కరీంనగర్​ జిల్లా కొండగట్టు నుంచి యాత్ర చేపట్టనున్నట్టు సమాచారం.

(ప్రభాన్యూస్ బ్యూరో ఉమ్మడి కరీంనగర్): జ‌న‌సేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరాధ్యదైవం, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకొని, అనంతరం ధర్మపురి నారసింహుని క్షేత్రం, అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నాంపల్లి గుట్ట నారసింహుని క్షేత్రాన్ని సంద‌ర్శించ‌నున్న‌టు తెలుస్తోంది. మిగతా 30 నారసింహ క్షేత్రాలను దశలవారీగా దర్శించి ప్రజలను చల్లగా చూడాలని స్వామి దీవెనలు కోరుకోవడానికి ఈ యాత్ర సంకల్పించారు. తెలంగాణలోని క్షేత్రాల పర్యటనలో భాగంగా అక్కడి నాయకులు, జన సైనికులతో కూడా పరిమితమైన సమావేశాలు చేయాలని నిర్ణయించారు..

అలాగే మార్చి 14న ఆవిర్భావ దినోత్సవానికి సన్నాహానికి ముందస్తుగా ఇక్కడికి రానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. 2009 లో ప్రజారాజ్యం తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్పుడు హుస్నాబాద్ ప్రాంతంలో విద్యుత్ ప్రమాదం నుండి యట పడ్డారు. నన్ను విద్యుత్ ప్రమాదం నుంచి కాపాడి, నాకు పునర్జన్మ నిచ్చింది కొండగట్టు అంజన్న అని పవన్ కళ్యాణ్ నమ్మకం అందుకే ఆయన 2018 లో మొదటి జనసేన యాత్ర ఇక్కడి నుండే ప్రారంభించారు. తిరిగి కొండగట్టు నుండి ప్రారంభించాలిని సంకల్పించడంతో జన సైనికులు,అభిమానులు పర్యటన విజయవంతం చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఫిబ్రవరి చివరి వారంలో పవన్ కళ్యాణ్ పర్యటించే అవకాశముంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement