Friday, April 26, 2024

పాకిస్తాన్ జైలులో భారత మత్స్యకారుడి మృతి.. కారణమేంటో చెప్పని పాక్ సర్కారు..

గుజరాత్‌కు చెందిన 50 ఏళ్ల మత్స్యకారుడు ఏడాది క్రితం సముద్రంలో పాకిస్తానీ అధికారులకు పట్టుబడ్డాడు. దాంతో అతడిని జైలులో పెట్టారు పాక్ అధికారులు, కాగా ఇప్పుడు అతను తెలియని కారణాల వల్ల ఆ దేశంలోని జైలులో మరణించాడని సోమవారం పాకిస్తాన్ అధికారులు తెలిపారు.
మృతుడిని గిర్-సోమ్‌నాథ్ జిల్లాలోని సూత్రపాడ గ్రామానికి చెందిన జయంతి సోలంకిగా గుర్తించారు.
అతను కొన్ని వారాల క్రితం చనిపోయాడు.అయితే నిన్న ఈ మరణానికి సంబంధించి స్థానిక అధికారులకు సమాచారం అందిందని ఒ అధికారి తెలిపారు.

మత్స్యకారుడి మృతదేహాన్ని స్వీకరించేందుకు వెరావల్‌కు చెందిన గుజరాత్ మత్స్య శాఖ బృందం పంజాబ్‌లోని వాఘా- అట్టారీ సరిహద్దుకు చేరుకుందని మత్స్య అధికారి విశాల్ గోహెల్ తెలిపారు.
“మా బృందం ఇప్పటికే అట్టారి- వాఘా సరిహద్దుకు చేరుకుంది. ఈ రాత్రికి మృతదేహాన్ని మాకు అప్పగిస్తారని మేము భావిస్తున్నాము. భౌతిక అవశేషాలను ఇక్కడకు తీసుకువచ్చి సూత్రపాద వద్ద కుటుంబ సభ్యులకు అప్పగిస్తాం” అని గోహెల్ చెప్పారు. పాకిస్తాన్‌లోని భారత రాయబార కార్యాలయం నుంచి సోలంకి మృతి గురించి తెలుసుకున్న కేంద్ర ప్రభుత్వం తదుపరి ప్రక్రియను చేపట్టాల్సిందిగా గుజరాత్ మత్స్యశాఖను కోరిందని ఆయన చెప్పారు.

సోలంకి కేంద్ర పాలిత ప్రాంతమైన డయ్యూ, డామన్ మరియు దాద్రా నగర్ హవేలీలోని వనక్‌బరా గ్రామానికి చెందిన వ్యక్తి అని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అతను ఇతర మత్స్యకారులతో “రసూల్ సాగర్” పడవలో ఉన్నప్పుడు అరేబియా సముద్రంలో IMBL (అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖ) సమీపంలో ఒక సంవత్సరం క్రితం పాకిస్తాన్ మారిటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీ (PMSA) అతన్ని పట్టుకున్నట్లు గోహెల్ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement