Saturday, April 27, 2024

ఆర్య‌న్ ఖాన్ డ్ర‌గ్స్ కేసులో సాక్షి ‘ప్ర‌భాక‌ర్’ – గుండెపోటుతో మృతి

ఆర్య‌న్ ఖాన్ డ్ర‌గ్స్ కేసులో స్వ‌తంత్ర సాక్షి ప్ర‌భాక‌ర్ సెయిల్ హార్ట్ ఎటాక్ తో తాను అద్దెకి ఉంటున్న అపార్ట్ మెంట్ లో మృతి చెందాడు. ఆయ‌న లాయ‌ర్ తుషార్ ఖండారే ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. మృతి చెందిన సమయంలో ఆయన ఇంట్లోనే ఉన్నారని, ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు లేవని అన్నారు. సెయిల్‌కి తల్లి, భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గ్రామంలో ఉన్న సోదరులు వచ్చిన తర్వాత అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. డ్రగ్ క్రూయిజ్ కేసులో అరెస్ట్ అయ్యాడు బాలీవుడ్ స్టార్ హీరో త‌న‌యుడు ఆర్యన్ ఖాన్. ఈ కేసులో మరో సాక్షి అయిన కేపీ గోసావికి సెయిల్ సెక్యూరిటీగార్డుగా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement