Saturday, April 27, 2024

ఐఫా-2023లో.. ఉత్త‌మ న‌టుడిగా హృతిక్ రోష‌న్

ఐఫా-2023లో ఉత్త‌మ న‌టుడిగా నిలిచారు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోష‌న్. ఈ అవార్డుల వేడుకకు యూఏఈ రాజధాని అబుదాబి వేదిక అయింది. బాలీవుడ్‌ తారల తళుకు బెలుకులు, నృత్య ప్రదర్శనల మధ్య అంగరంగ వైభవంగా ఈ వేడుక జరిగింది. ఈ వేడుకకు బాలీవుడ్‌ నటులు విక్కీ కౌశల్‌, అభిషేక్‌ బచ్చన్‌లు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ఇరవై మూడవ ఐఫా అవార్డుల్లో ఉత్తమ నటుడుగా హృతిక్‌ రోషన్‌ నిలిచాడు. విక్రమ్‌ వేద సినిమాకు గానూ హృతిక్‌ ఈ అవార్డును అందుకున్నాడు. ఉత్తమ నటిగా అలియాభట్‌ ఎంపికైంది. గంగూబాయి కతియావాడి సినిమాలో తన నటనకు ఈ అవార్డు వరించింది. కాగా ఈ అవార్డుల ఫంక్షన్‌కు అలియా రాకపోవడంతో ప్రముఖ నిర్మాత జయంతీలాల్‌ ఈ అవార్డును స్వీకరించాడు. ఉత్తమ చిత్రంగా దృశ్యం-2 నిలిచింది. భారతీయ చిత్ర పరిశ్రమకు విశేష సేవలందించినందుకు గానూ కమల్‌ హాసన్‌ అవుట్‌ స్టాండింగ్‌ అచీవ్‌మెంట్‌ ఇన్‌ ఇండియా సినిమా పురస్కారాన్ని అందుకున్నాడు.కాగా ఐఫా-2023 విన్నర్స్‌ లిస్ట్ ని కూడా రిలీజ్ చేశారు.

ఉత్తమ చిత్రం – దృశ్యం-2
ఉత్తమ దర్శకుడు – ఆర్ మాధవన్ (రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్)
ఉత్తమ నటుడు- హృతిక్‌ రోషన్‌(విక్రమ్ వేద)
ఉత్తమ నటి – అలియా భట్ (గంగూబాయి కతియావాడి)
ఉత్తమ సహాయ నటుడు – అనిల్ కపూర్ (జగ్ జగ్ జియో)
ఉత్తమ సహాయ నటి – మౌని రాయ్ (బ్రహ్మాస్త్ర మొదటి భాగం: శివ)
ఉత్తమ తొలి చిత్ర నటుడు – శంతను మహేశ్వరి (గంగూబాయి కతియావాడి) మరియు బాబిల్ ఖాన్ (ఖలా)
ఉత్తమ తొలి చిత్ర నటి – ఖుషాలి కుమార్ (ధోఖా: రౌండ్ డి కార్నర్)
ఉత్తమ కథ – జస్మీత్ కె రీన్ మరియు పర్వీజ్ షేక్ (డార్లింగ్స్)
ఉత్తమ ఎడిటింగ్‌- సందీప్‌ ఫ్రాన్సిస్‌ (దృశ్యం-2)
ఉత్తమ స్పెషల్‌ ఎఫెక్ట్స్‌- (బ్రహ్మాస్త్ర మొదటి భాగం: శివ)
ఉత్తమ స్క్రీన్‌ప్లే- (గంగూబాయి కతియావాడి)
ఉత్తమ సంభాషణలు- (గంగూబాయి కతియావాడి)
ఉత్తమ కొరియోగ్రఫి- సీజర్‌ గోన్సాల్వేస్‌, బోస్కో మార్టిన్స్ (భేదియా)
ఉత్తమ సౌండ్‌ మిక్సింగ్- మోనికా ఓ మై డార్లింగ్‌
ఉత్తమ నేపథ్య గాయకుడు – అరిజిత్ సింగ్ (కేసరియా -బ్రహ్మాస్త్ర మొదటి భాగం: శివ)
ఉత్తమ నేపథ్య గాయకురాలు – శ్రేయా ఘోషల్ (కేసరియా -బ్రహ్మాస్త్ర పార్ట్ వన్: శివ)
ఉత్తమ నేపథ్య సంగీతం- విక్రమ్‌ వేద
ఉత్తమ సంగీతం – ప్రీతమ్ చక్రవర్తి (బ్రహ్మాస్త్ర మొదటి భాగం: శివ)
ఉత్తమ సాహిత్యం – అమితాబ్ భట్టాచార్య (బ్రహ్మాస్త్ర మొదటి భాగం: శివ)
ఉత్తమ అడాప్టెడ్ కథ – అమీల్ కీయన్ ఖాన్ మరియు అభిషేక్ పాథక్ (దృశ్యం 2)
రీజనల్‌గా మంచి విజయం సాధించిన సినిమాగా – రితీష్ దేశ్‌ముఖ్ మరియు జెనీలియా డిసౌజా (వేద్)
భారతీయ చలనచిత్ర రంగంలో అత్యుత్తమ అచీవ్మెంట్ – కమల్ హాసన్.

Advertisement

తాజా వార్తలు

Advertisement