Saturday, May 4, 2024

లెజండ‌రీ బాక్సర్ మైక్ టైస‌న్ బ‌ర్త్ డే-స్పెష‌ల్ విషెష్ తెలిపిన లైగ‌ర్ చిత్ర టీం

పాన్ ఇండియా స్పోర్ట్స్ యాక్ష‌న్ ఫిల్మ్ గా తెర‌కెక్కుతోంది లైగ‌ర్. ఈ చిత్రంలో హీరోగా విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టిస్తున్నాడు. ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్ మైక్ టైసన్ ఈ సినిమాతో మొట్ట మొదటిసారిగా ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద కనిపించబోతున్నారు.కాగా నేడు లెజండరీ బాక్సర్ మైక్ టైసన్ పుట్టినరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం అతనికి శుభాకాంక్షలు తెలుపుతూ ఒక ప్రత్యేకమైన వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. నిర్మాత కరణ్ జోహార్ నుండి మొదలుకొని విజయ్ దేవరకొండ – ఛార్మీ కౌర్ – విష్ణు – అనన్య పాండే ..పూరీ జగన్నాధ్ ఈ వీడియో ద్వారా టైసన్ కు బర్త్ డే విషెస్ తెలిపారు.


అంతేకాదు ‘లైగర్’ సినిమా యుఎస్ఏ షెడ్యూల్ కు సంబంధించిన మేకింగ్ విజువల్స్ ను కూడా మనం ఈ వీడియోలో చూడొచ్చు. మైక్ టైసన్ సింప్లిసిటీ మరియు అతని హంబుల్ యాటిట్యూట్ ను ఈ వీడియోలో గమనించవచ్చు. అక్కడ బాక్సింగ్ దిగ్గజం టీమ్ అందరితో కలిసి ఎంతో ఉల్లాసంగా కనిపించాడు.ఇందులో రమ్యకృష్ణ కీలక పాత్ర పోషించగా.. రోనిత్ రాయ్ – విష్ణు రెడ్డి – అలీ – మకరంద్ దేశ్ పాండే – గెటప్ శ్రీను తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.పూరీ కనెక్ట్స్ .. బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ కలసి సంయుక్తంగా భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. పూరి జగన్నాధ్ – ఛార్మీ కౌర్ – కరణ్ జోహార్ మరియు అపూర్వ మెహతా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.విష్ణు శర్మ సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేయగా.. థాయ్లాండ్ కు చెందిన కెచా స్టంట్ డైరెక్టర్ గా చేశారు. జానీ షేక్ బాషా ఆర్ట్ డైరెక్టర్ గా.. జునైద్ సిద్ధిఖీ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. హిందీ తెలుగు తమిళం కన్నడ మరియు మలయాళం భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని 2022 ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement