Wednesday, May 22, 2024

నేడు పెరిగిన బంగారం.. త‌గ్గిన వెండి ధ‌ర‌లు

నేడు బంగారం ధ‌ర పెరిగింది. హైదరాబాద్‌లో బంగారం ధర అక్టోబర్ 7న మళ్లీ పెరిగింది. ప్రస్తుతం భాగ్యనగరంలో 22 క్యారెట్లకు చెందిన పసిడి రూ. 47 వేల 850 వద్ద ఉంది. ఇది 10 గ్రాముల ధర. అంటే ఒక్కరోజే తులం బంగారం ధర ఇక్కడ రూ. 100 మేర పెరిగింది. క్రితం రోజు 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారాన్ని రూ. 47,750కి విక్రయించారు. అంటే నాలుగు రోజుల వ్యవధిలో పసిడి ఏకంగా రూ. 1500 మేర పెరిగింది. దీంతో పండగ వేళ బంగారం కొనుగోలు చేయాలనుకున్నవారు వెనకడుగు వేస్తున్నారు.

ఇదే సమయంలో 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల గోల్డ్ కూడా రూ.100 మేర పెరిగి.. రూ. 52,200కు చేరింది. గత 10 రోజుల్లో 6 సెషన్లు బంగారం పెరుగుతూనే వచ్చింది. రెండు రోజులు ధరల్లో ఎలాంటి మార్పు లేకపోగా.. మరో రెండు సెషన్లు స్వల్పంగా తగ్గింది. ఓవైపు బంగారం ధర పెరుగుతుంటే.. మరోవైపు సిల్వర్ పడిపోయింది. అక్టోబర్ 7న ధరల ప్రకారం చూస్తే వెండి ధర రూ. 500 మేర పడిపోయింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.500 మేర తగ్గి రూ. 66,500కు చేరింది. అక్టోబర్ 5న 300 రూపాయల మేర పెరిగిన సిల్వర్, అంతకుముందు రోజు రికార్డు స్థాయిలో రూ.4200 పెరగడం గమనార్హం. ఇప్పుడిప్పుడే మళ్లీ కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. నాలుగు రోజుల కిందట రూ.62 వేలుగా ఉన్న కిలో వెండి.. ఇప్పుడు రూ.67 వేల మార్కుకు చేరుకోవడం అంటే మాటలా. ఏకంగా రూ. 5 వేల మేర పెరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement