Saturday, April 27, 2024

తగ్గిన బంగారం..పెరిగిన వెండి

నేటి బంగారం ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో గోల్డ్ రేట్లు తగ్గాయి. ప్రస్తుతం మన దగ్గర 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.100 మేర పడిపోయి ప్రస్తుతం రూ.46 వేల 250కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.110 మేర పెరిగింది. ప్రస్తుతం ఇది రూ.50 వేల 560 నుంచి 50 వేల 450 రూపాయలకు పడిపోయింది. దీంతో గత 4 సెషన్లలో 3 సెషన్లు బంగారం ధర తగ్గడం గమనార్హం. అందుకే బంగారం కొనాలంటే ఇదే మంచి సమయం. మరికొద్దిరోజులు కూడా గోల్డ్ రేటు తగ్గే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు త్వరపడండి.హైదరాబాద్‌లో వెండి రేటు విషయానికి వస్తే మళ్లీ రూ.500 మేర పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో బంగారం ధర రూ.61500కు చేరింది. ఇతర ప్రధాన నగరాల్లోనూ దాదాపుగా గోల్డ్, సిల్వర్ రేట్లు కాస్త అటుఇటుగా ఉంటాయి. ఇవి ఆయా ప్రాంతాల పరిస్థితులను బట్టి.. అక్కడి ట్యాక్స్‌లను బట్టి కూడా మారుతుంటాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement