Monday, May 13, 2024

నేటి బంగారం ధ‌రలు-త‌గ్గిన వెండి రేటు

నేటి బంగారం ధ‌ర‌లు కాస్త త‌గ్గాయి..బంగారం ధర బాటలోనే వెండి కూడా పయనించింది. వెండి రేటు కూడా నేడు భారీగా పడిపోయింది. దీంతో బంగారం, వెండి కొనాలని భావించే వారికి ఇది ఊరట కలిగించే అంశమని చెప్పుకోవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర నేలచూపులు చూస్తుండటం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.హైదరాబాద్ మార్కెట్‌లో జూలై 16న బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 430 తగ్గింది. దీంతో తులం రేటు రూ. 50,730కు దిగి వచ్చింది. అలాగే 22 క్యారెట్ల ఆర్నమెంటల్ గోల్డ్ రేటు కూడా రూ. 400 తగ్గింది. దీంతో ఈ పసిడి రేటు 10 గ్రాములకు రూ. 46,500కు పడిపోయింది. కాగా నిన్న బంగారం ధరలు పైపైకి కదిలిన విషయం తెలిసిందే. పసిడి రేటు రూ. 200 మేర పెరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement