Wednesday, May 8, 2024

స్థిరంగా బంగారం ధ‌ర‌లు-పెరిగిన వెండి

నేటి బంగారం ఇలా ఉన్నాయి. బులియన్ మార్కెట్లో బంగారం ధరలు మారలేదు. 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర ఆదివారం మార్కెట్లో రూ.47,800 వద్ద రికార్డయింది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర స్థిరంగా రూ.52,150 వద్ద నమోదైంది. అయితే వెండి ధర మాత్రం భారీగా తగ్గింది. కేజీ సిల్వర్ ధర రూ.700 తగ్గి రూ.61,300గా కొనసాగుతోంది. గత వారం రోజులుగా సిల్వర్ భారీగా పతనమవుతూనే ఉంది. కేజీ సిల్వర్ రేటు వారం రోజుల్లో రూ.63400 నుంచి రూ.61300కి దిగొచ్చింది.

దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర స్థిరంగా రూ.47,950గా ఉంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.52,310గా రికార్డయింది. సిల్వర్ రేటు అక్కడ కూడా రూ.500 తగ్గి రూ.55,500గా ఉంది. డాలర్ ఇండెక్స్ మెరుగుపడటం, వడ్డీ రేట్లు పెంచేందుకు అమెరికా ఫెడరల్ అధికారులు కట్టుబడి ఉండటం వంటి కారణాలతో బంగారం ధరలు పడిపోతున్నాయి. నాలుగు వారాల ర్యాలీ తర్వాత.. మళ్లీ 2 శాతానికి పైగా వీక్లి నష్టాలను నమోదు చేశాయి. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధర 10 గ్రాములు రూ.51,505 స్థాయిల వద్ద స్థిరపడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement