Tuesday, May 7, 2024

ఇవాళ స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

మనదేశంలో బంగారాని చాలా ప్రధాన్యత ఉంది. ముఖ్యంగా మహిళలు బంగారం కొనుగోళ్లపై ప్రత్యేక ఆసక్తి చూపిస్తారు. అయితే మన దేశంలోనే కాకుండా ప్రపంచంలోని అన్ని దేశాల్లో బంగారానికి ఉన్న డిమాండ్ స్పెషల్. బంగారాన్ని కొనుగోలు చేయడానికి చాలా మంది ఇష్టపడతారు. ఎప్పుడు బంగారానికి డిమాండ్ ఉంటూంది. అయితే.. కొన్ని రోజులుగా బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. కరోనా నేపథ్యంలో పసిడి ధరలు పెరుగుతున్నాయని నిపుణులు అంటున్నారు. అయితే గత వారం రోజుల నుంచి తగ్గిన బంగారం ధరలు… తాజాగా పెరిగాయి. ఈరోజు పెరిగిన ధరల ప్రకారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరిగి రూ. 44,560 కి చేరింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరిగి రూ. 48,610 కి చేరింది. బంగారం ధరలు పెరగగా.. వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. కిలో వెండి ధర రూ. 63,800 పలుకుతుంది.

ఇది కూడా చదవండి: స్వ‌చ్ఛ భారత్ లో ఆ సిటీ నెంబర్ వన్ః ప్రధాని మోదీ

Advertisement

తాజా వార్తలు

Advertisement