Friday, April 26, 2024

Gold News: పెరిగిన బంగారం, వెండి ధరలు.. నేటి రేట్లు ఇలా..

పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్. నిన్న నిలకడగా కొనసాగిన బంగారం ధరలు ఈ రోజు స్వల్పంగా పెరిగింది. వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది. హైదరాబాద్ మార్కెట్‌లో సోమవారం బంగారం ధర రూ.10 పెరిగింది. దీంతో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,490కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.10 పెరుగుదలతో రూ.45,360కు చేరింది. బంగారం ధర స్వల్పంగా పెరిగితే.. వెండి రేటు రూ.100 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.66,200కు చేరింది.

విజ‌య‌వాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 49,490కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 45,360గా ఉంది. అలాగే కిలో వెండి ధ‌ర రూ. 66,200గా నమోదైంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 51,810కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 47,510 వద్ద కొనసాగుతోంది. అలాగే కిలో వెండి ధ‌ర రూ. 62,300కి ఎగసింది.

ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 48,310 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 47,310కి చేరింది. అలాగే కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 62,300 వద్ద కొనసాగుతోంది.

ఇక, కోల్‌క‌త్తలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 50,160 కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 47,460గా ఉంది. అలాగే కిలో వెండి ధ‌ర రూ. 62,300 వద్ద కొనసాగుతోంది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement