Thursday, May 16, 2024

ఖైదీగా చిరంజీవి – పోలీస్ గా ప‌వ‌న్ క‌ల్యాణ్

మెగాస్టార్ చిరంజీవి, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఒకే వేదిక‌పై క‌నిపిస్తే ఫ్యాన్స్ కి పండ‌గే. కాగా తాజాగా వారిద్ద‌రూ క‌లిసి షూటింగ్ లో పాల్గొన్న వీడియోని సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ రిలీజ్ చేసింది. ఈ వీడియోని హీరో రామ్ చ‌ర‌ణ్ విడుద‌ల చేశారు. ఈ వీడియోలో మెగాస్టార్ చిరంజీవి ఖైదీ గెటప్‌ లో కనిపించగా.. పవన్‌ కళ్యాణ్‌ పోలీస్‌ గెటప్‌ లో కనిపించారు. అదేంటీ అనుకుంటున్నారా.. అవును.. గాడ్‌ ఫాదర్‌ సినిమాలో చిరు ఖైదీ గెటప్, బీమ్లా నాయక్‌ సినిమా పవన్‌ కళ్యాణ్‌ ది పోలీస్‌ గెటప్‌. అయితే.. వీరిద్దరూ షూటింగ్‌ లో ఒకే సమయంలో పాల్గొన్నారు. ఆ వీడియోనే తాజాగా.. హీరో రామ్‌ చరణ్‌ చేతుల మీదుగా విడుదల చేశారు. ఇక ఈ వీడియోను చూసిన మెగా, పవర్‌ ఫ్యాన్స్‌ ఎంజాయ్‌ చేస్తున్నారు.

https://twitter.com/AlwaysRamCharan/status/1496704417495539716
Advertisement

తాజా వార్తలు

Advertisement