Monday, April 29, 2024

ధర్మం – మర్మం : పుణ్యతీర్థములు – ఆసుర తీర్థములు (ఆడియోతో…)

ఆసుర తీర్థముల గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

ఆసుర తీర్థములు :
బ్రహ్మపురాణం, గౌతమీ ఖండంలో నదీబేధాన్ని వివరిస్తూ ఆసుర తీర్థము గూర్చి వశిష్టాది మహర్షులకు బ్రహ్మదేవుడు ఈ విధంగా వివరించెను.
పర్వత ప్రాంతాలలో అసురులు నిర్మించిన తీర్థములను ఆసుర తీర్థములుగా పేర్కొనబడినవి. అవి గయుడు, కోలాసురుడు, వృత్రాసురుడు, త్రిపురాసురుడు, అంధకాసురుడు, హయగ్రీవుడు, లవణాసుడురు, నముచి, శృంగకుడు, యముడు, పాతాళకేతువు, మధువు, పుష్కరుడు ఈ పదమూడు మంది రాక్షసులు నిర్మించి నివసించిన తీర్థములు అసుర తీర్థములు. ఈ ఆసుర తీర్థములు శుభప్రదములు. ఋషి తీర్థముల కంటే ఆసుర తీర్థములు బహు పుణ్యఫలములను ప్రసాదించును.

వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement