Monday, May 13, 2024

Sangareddy: ఎయిర్ గ‌న్ పేలి బాలిక మృతి

ఎయిర్ గ‌న్ పేలి బాలిక మృతిచెందిన ఘ‌ట‌న సంగారెడ్డిలో చోటుచేసుకుంది. జిల్లాలోని జిన్నారం మండలం వావిలాలో ఈ విషాదం నెలకొంది. ఎయిర్ గన్ పేలి బాలిక మృతి చెందింది. ఓ ఫాంహౌస్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. పిల్లలు ఎయిర్ గన్ తో ఆడుకుంటుండగా ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. బాలిక మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కాగా ఘటనకు సంబంధించిన‌ కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎయిర్ గన్ ను పిల్లలకు అందుబాటులో ఉంచడం తీవ్ర నేరంగా పరిగణించాల్సి ఉంటుందని పోలీసుు చెబుతున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఫాంహౌస్ యజమానిపై కేసు నమోదు చేసే అవకాశముంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement