Saturday, May 4, 2024

‘గ‌ని’ రిలీజ్ ఎప్పుడంటే

కిర‌ణ్ కొర్ర‌పాటి డైరెక్ష‌న్ లో తెర‌కెక్కుతున్న చిత్రం గ‌ని. ఈ చిత్రంలో హీరోగా వ‌రుణ్ తేజ్ న‌టిస్తున్నాడు. ఈ చిత్రాన్ని అల్లు బాబి-సిద్ధు ముద్ద నిర్మిస్తున్నారు. ఈ చిత్ర రిలీజ్ డేట్ ని ఎనౌన్స్ చేశారు. ఈ మూవీ వ‌చ్చే ఏడాది మార్చి 18న రిలీజ్ కానుంది. ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో నడుస్తుంది. బాక్సర్ గా వరుణ్ తేజ్ కనిపించనున్నాడు. రిలీజ్ డేట్ తో కూడిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన నాయికగా సయీ మంజ్రేకర్ తెలుగు తెరకి పరిచయమవుతోంది. జగపతిబాబు ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. ఇక ముఖ్యమైన పాత్రల్లో సునీల్ శెట్టి .. ఉపేంద్ర .. నవీన్ చంద్ర .. నదియా నటించారు. తమన్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవనుందట‌. ఈ పాత్రను చాలా సహజంగా ప్రేక్షకుల దగ్గరికి తీసుకుని వెళ్లడం కోసం ఆయన ప్రత్యేక శిక్షణ పొందాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement